Rishabh Pant: పులి తిరిగివచ్చింది.. గర్జించడానికి సిద్ధంగా ఉంది : పంత్‌కు దిల్లీ ఘనస్వాగతం

సుదీర్ఘ కాలం అనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన రిషభ్‌ పంత్‌కు దిల్లీ క్యాపిటల్స్‌ ఘన స్వాగతం పలికింది.

Updated : 13 Mar 2024 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant).. సుదీర్ఘ విరామం అనంతరం ఐపీఎల్‌ 2024(IPL 2024)తో పునరాగమనం చేయబోతున్నాడు. అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ (BCCI) ప్రకటించిన నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) జట్టును ముందుండి నడిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్‌కు దిల్లీ జట్టు ఘన స్వాగతం పలికింది. ‘‘పులి తిరిగివచ్చింది.. గర్జించడానికి సిద్ధంగా ఉంది. రిషభ్‌ పంత్‌కు తిరిగి స్వాగతం. నిన్ను చూసేందుకు ఇక వేచి ఉండలేం’’ అంటూ ఎక్స్‌లో అతడి ఫొటోను పంచుకుంది.

ఫస్ట్‌ దేశం కోసం ఆడాలి.. డబ్బు సంపాదన తర్వాత

పంత్‌ బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌ కూడా చేయడానికి తగ్గ ఫిట్‌నెస్‌ సాధించినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. పంత్‌ ఈసారి ఐపీఎల్‌లో ఆడటం ఖరారైనప్పటికీ.. వికెట్‌ కీపింగ్‌ చేస్తాడా లేదా అనే విషయంలో సందేహాలు ఉండేవి. బీసీసీఐ ప్రకటనతో సందిగ్ధత తొలగిపోయింది. దీంతో ఈ నెల 22 నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్‌ 17వ సీజన్లో పంత్‌.. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. వికెట్‌ కీపింగ్‌ కూడా చేయబోతున్నాడు.

పంత్‌ గత సీజన్‌కు దూరం కావడంతో.. డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలో దిల్లీ జట్టు పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. మరి పంత్‌ తిరిగి వచ్చిన నేపథ్యంలో.. ఈ సీజన్‌లో ఆ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని