Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. బోధిస్తున్నారా.. బాధిస్తున్నారా?
పాఠశాలలో ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని ఆరుబయట కూర్చోబెట్టడం, గోడ కుర్చీ వేయించడం చూస్తుంటాం. విజయవాడ మాచవరం టీఎంఆర్‌సీ మున్సిపల్ పాఠశాలలో మాత్రం విద్యార్థులు బడికి రావడమే పాపమన్నట్లు వారిని ఆరుబయట కంకర కుప్పపై కూర్చోబెట్టారు. ఒకవైపు రాళ్లు గుచ్చుకొని విద్యార్థులు బాధపడుతున్నా.. ఉపాధ్యాయులు ఇవేవీ పట్టనట్లు పాఠాలు చెప్పుకొంటూ పోతున్నారు. పైగా పిల్లలు కూర్చున్న పక్కనే భవనంపైన పనులు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అంతిమయాత్రలో అంతులేని కష్టాలు !
మృతదేహాన్ని మరుభూమికి తీసుకెళ్లాలంటే నీటిలోంచి మోసుకెళ్లాల్సి వస్తోంది. అయినవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఇదో పెద్ద సమస్యగా మారింది. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రధాన శ్మశానవాటిక శారదా నదికి ఆవలి ఒడ్డున ఉంది. నది దాటడానికి మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు స్థానికుల సహకారంతో గతంలో తాత్కాలికంగా కాలిబాట నిర్మించారు. ఇటీవల వరదకు అది కాస్తా కొట్టుకుపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఎమ్మెల్యేగా మాటిచ్చారు.. మంత్రిగా మాయ చేశారు
2019 ఎన్నికల సమయంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి జయరాంకు రైతులు సమస్యను విన్నవించారు. రాబోయేది వైకాపా ప్రభుత్వమే తప్పకుండా భూములు ఇప్పించేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2020లో ఆ భూములు మంత్రి జయరాం తన కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేయడం గమనార్హం. ఎలాంటి ఆదాయ వనరు లేకపోయినా 30 ఎకరాల భూమిని రూ.52.42 లక్షలతో కొనుగోలు చేయడానికి డబ్బు ఎలా వచ్చిందో 90 రోజుల్లో సమాధానమివ్వాలని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కట్టుకుంటారా... లాక్కోమంటారా?
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం, పక్కా ఇల్లు సమకూర్చేందుకే నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టామని చెప్పిన వైకాపా ప్రభుత్వం 2020 డిసెంబరు నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 1,508 లేఔట్లలో దాదాపు 3.31 లక్షల మందికి స్థలాలు మంజూరు చేసింది. జగనన్న కాలనీల పేరిట వాటిని అభివృద్ధి చేస్తామని చెప్పి అరకొరగా పనులు ప్రారంభించింది. నేటికీ అవి కొలిక్కి రాలేదు. చాలా లేఔట్లకు సామగ్రి తీసుకెళ్లేందుకు సరైన రహదారులు లేని దుస్థితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మొక్కల పేరిట మెక్కుడు!
అతివల ఆదాయం పెంచడంతోపాటు పేదల జీవనోపాధులు మెరుగుపరచడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ద్వారా చేపట్టిన మొక్కలు, ఉద్యానాల పెంపకం అవినీతిమయంగా మారిపోయింది. వెలుగు/వైకేపీలో కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినా బాధ్యులపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో 10 నుంచి 14 విడతల వరకు జరిగిన సామాజిక తనిఖీల్లో ఉద్యానాలు, రహదారి పక్కన మొక్కల పెంపకాల్లో రూ. 2.38 కోట్ల మేర సొమ్ములు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. జగన్ మామయ్యా.. ఇదేం పరీక్ష
‘‘ పరీక్ష అంటే.. ఉపాధ్యాయులు ప్రశ్నపత్రం ఇస్తారు.. తెల్ల కాగితంపై విద్యార్థులు సమాధానాలు రాస్తారు. కానీ శుక్రవారం నుంచి ప్రారంభమైన ఫార్మేటివ్-2 పరీక్షలో ప్రశ్నపత్రం ఇవ్వలేదు.. బోర్డుపై ఉపాధ్యాయులు ప్రశ్నలు రాశారు.. వాటిని విద్యార్థులు నోట్ చేసుకుని జవాబులు రాయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం చుక్కలు చూపించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 4,46,876 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 1,92,312 మంది ఫార్మేటివ్-2 పరీక్షలకు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఇచ్ఛాపురం టు అరకు
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ జాతీయ రహదారుల విస్తరణ జరుగుతోంది. పాచిపెంట మండలంలో గ్రీన్‌ఫీల్డ్ రహదారి, రాజమహేంద్రవరం నుంచి అరకు మీదుగా విజయనగరాన్ని అనుసంధానం చేసేలా ఎన్‌హెచ్ 516ఈ రూపుదిద్దుకొంటున్నాయి. వీటితో పాటు అరకు నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందనేది ప్రతిపాదన ఉద్దేశం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఫొటోలకి హారతులిచ్చా..రీల్స్‌కి ప్రదక్షిణలు చేశా!
అమీర్‌పేట్ సెంటర్లో ఆదరాబాదరాగా వెళ్తుంటే.. చుక్కల చుడీదార్ వేసుకున్న ఓ సూదంటు చూపుల చిన్నది ఒక్కసారిగా నన్ను మైకంలో ముంచెత్తింది. మైమరిచి తననే చూస్తుంటే.. ఆ క్షణమే మాయమై.. నా గుండెకు పెద్ద గాయం చేసింది. వెనకే ఫాలో అయితే లాభం లేదనుకొని ఆన్‌లైన్‌లో గాలమేసి పట్టుకోవడమే మేలనుకున్నా. చుట్టుపక్కల అడిగి మరీ సుందరాంగి సమాచారం సేకరించా. ఆపై అర్జెంటుగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాల్ చేసి.. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి ప్రాణమంతా ఫోన్‌పైనే పెట్టేశా. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పెళ్లికానుక.. నిబంధనల మెలిక
నిరుపేద వధువులు వివాహాలు చేసుకోడానికి వీలుగా వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీతోఫాకు దరఖాస్తు చేసుకునే విధివిధానాలు వివరిస్తూ ఈ ఏడాది సెప్టెంబరు 30న ప్రభుత్వం జీఓ నం. 50 విడుదల చేసింది. అయితే దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని సంప్రదించాలి అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా రెండునెలలైనా ఇంతవరకు ఒక్క దరఖాస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు (డీఆర్‌డీఏ) రాలేదు. ఇక్కడ లాగిన్‌లో దరఖాస్తు నమోదైతే కలెక్టర్ లాగిన్‌కి పంపుతారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. పేరుకే పీఏ.. చేసేవన్నీ దందాలే..
‘ఎమ్మెల్యే పీఏ.. పవర్ అంతా తనదే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు అమ్మాయిలనూ లైంగికంగా లోబరచుకునేందుకు వెనకాడలేదు. అధికారం చేతిలో ఉందని ఆగడాలకు అంతులేకుండా పోవడంతో కటకటాలపాలయ్యారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వద్ద ప్రయివేటు పీఏగా పనిచేస్తున్న శివపై గత నెల 29న హనుమకొండ ఠాణాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు నమోదు కావడం నగరంలో సంచలనంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
-
General News
Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
-
Movies News
Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్ రిజెక్ట్ చేశారు: గుణశేఖర్
-
Politics News
KVP: జగన్‌కు ఎందుకు దూరమయ్యానో త్వరలోనే చెప్తాను : కేవీపీ
-
India News
IndiGo: గగనతలంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. ఇండిగో విమానంలో ఘటన