Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. నీట్ యూజీ, క్యూట్ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2023 పరీక్ష తేదీ ఖరారు అయింది. ఈ మేరకు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) క్యాలెండర్ విడుదల చేసింది. మే 7న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించనున్నట్ల తెలిపింది. ఏటా లక్షల మంది పోటీ పడే ఈ పరీక్ష కోసం విద్యార్థులు గత కొన్నిరోజులుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్-2023 తేదీలను సైతం ఎన్టీఏ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పరిష్కారం.. కోట్ల వ్యాపారమైంది!
అందానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే అమ్మాయిలు చిన్న చర్మసమస్యనీ తట్టుకోలేరు. జీలమ్ కూడా అంతే! తనకి సొరియాసిస్. పోగొట్టుకోవడానికని మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులెన్నో వాడింది. తగ్గక పోగా కొత్త సమస్యలొచ్చాయి. అప్పుడు సహజ ఉత్పత్తుల మీద దృష్టిపెట్టి విజయం సాధించింది. తర్వాత దాన్నే తన వ్యాపార మార్గంగా మలచుకొని విజయపథంలో సాగుతోంది. చర్మ సౌందర్యానికి ఇంట్లో దొరికే సహజ పదార్థాలే ఎక్కువ మేలు చేస్తాయన్నది ‘జీలమ్ అనికిందీ’ నమ్మకం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. త్వరలో ప్రేమతో పెంచుకునే వాచ్‌లు, సెల్‌ఫోన్లు
కొత్త సాంకేతికత వచ్చేకొద్దీ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ‘ఈ - చెత్త’ ముప్పు ముంచుకొస్తోంది. ఉపయోగించే సాధనానికి, మనిషికి మధ్య బంధాన్ని ఏర్పరిస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చని షికాగో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు భావించారు. అనుకున్నదే తడవుగా ఏకకణ జీవి సాయంతో పనిచేసే చేతి గడియారాన్ని రూపొందించారు. ఆ జీవికి వీరు ‘స్లైమ్ మోల్డ్’ అని నామకరణం చేశారు. ఈ జీవికి కావాల్సిన నీరు, ఓట్స్ అందిస్తేనే దాని పరిమాణం పెరిగి సర్క్యూట్ పనిచేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. రూ.5 కోట్ల ఆరోగ్య బీమా
అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే చికిత్స చేయించుకునేందుకు వీలు కల్పించేలా రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీని కనీసం రూ.5లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ తీసుకునే వీలుంది. దీనికి మరో రూ.1.5 కోట్ల అనుబంధ పాలసీలనూ జోడించుకునే వీలుంది. ప్రసూతి ఖర్చులు, ఓపీడీ, ఎలాంటి పరిమితులు లేకుండా గది అద్దె చెల్లింపు, ఎయిర్ అంబులెన్స్ తదితర ప్రయోజనాలను ఈ పాలసీ కల్పిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కీలేడీ చెంచు లక్ష్మి.. చోరీల్లో డబుల్ సెంచరీ..
ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ‘కీ’లేడీని అంబర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు కమిషనరేట్లలోని వివిధ ఠాణాల పరిధిలో జరిగిన చోరీల్లో ఇప్పటికే ఆమె డబుల్ సెంచరీ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఫింగర్ ప్రింట్ బ్యూరో డేటాబేస్ కేంద్రంలోని వేలిముద్రలను పోల్చిచూసి.. 24 గంటల్లోనే ఆమెను పట్టుకోగలిగారు. గురువారం అంబర్‌పేట ఠాణాలో డీఐ ప్రభాకర్, డీఎస్సై రాంచందర్‌రాజు వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రుణాలు ఇవ్వం.. పథకాలు ఆపేస్తాం!
‘మేమంతా గుంతకల్లులో నివసిస్తున్నాం. పొదుపు సంఘంలో ఉన్నాం. చెత్తపన్ను కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. కూలీ చేసుకుని జీవనం సాగించేవాళ్లం. ఇప్పటికే నిత్యావసరాలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు చెత్తపన్ను రూ.60 చెల్లించడం అదనపు భారం అవుతుంది. పన్ను చెల్లించకపోతే పొదుపు సంఘంలో ఉండొద్దని చెబుతున్నారు. రుణాలు రావని బెదిరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఇళ్ల ధరలు 6-10% పెరుగుతాయ్
ఇళ్ల ధరలు దేశ వ్యాప్తంగా 6 ప్రధాన నగరాల్లో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో 6-10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లోనూ గృహాల ధరలు 3-5 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ఇళ్ల నిర్మాణానికి వినియోగించే ఉక్కు, సిమెంట్, ఇటుక వంటి ముడి పదార్థాల ధరలు, భవన నిర్మాణ కార్మికుల కూలీ, భూమి విలువ పెరిగినందున ఇళ్ల ధరలు పెరుగుతాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. పైసా ఖర్చు లేకుండా... ప్రాణదానం
శరీరంలో ఏదో ఒక అవయవం చెడిపోయి మృత్యువుకు దగ్గరైన రోగులకు అవయవమార్పిడి ద్వారా ప్రాణదానం చేసేందుకు నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు నడుంబిగించాయి. జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా అవయవాలను సేకరించి సంబంధిత రోగులకు అమర్చేందుకు ఈ రెండు ఆస్పత్రుల్లోని నిపుణులైన వైద్యులు ఆపరేషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం గాంధీలో అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్లను నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఏజెంట్లు వెళ్తేనే లైసెన్సులొస్తాయ్!
రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్సులు... రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలనూ ఆన్‌లైన్ చేసింది. చిరునామాకే లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు వస్తాయి. ఇదంతా నిజం కాదు. రవాణా శాఖ కార్యాలయాల్లో ఉంటున్న ఏజెంట్లు వెళ్తేనే లైసెన్సులు వస్తాయి. వారు అడిగినంత ఇస్తేనే రాకెట్ వేగంతో పనులు పూర్తవుతాయి. గ్రేటర్ పరిధిలోని పది రవాణా శాఖ కార్యాలయాల్లో ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైన నిజాలివి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రూ.లక్ష డ్రా చేసి.. మరో బైక్‌లో పెట్టి మరిచి..
ఏటీఎంలో డ్రా చేసిన నగదును ఇతర ద్విచక్ర వాహనంలో పెట్టి మరిచిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌లోని కల్యాణపురికి చెందిన గుజ్జరి అర్జున్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఈ నెల 12న రాత్రి ప్రశాంతినగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో రూ.1.10లక్షలు డ్రా చేసి బయటకొచ్చి తన ద్విచక్ర వాహనం అనుకొని ఇతర వాహనంలో డబ్బులు పెట్టేసి మళ్లీ ఏటీఎంలోకి వెళ్లారు. తర్వాత వాహనం మీద ఇంటికి చేరుకొని చూడగా డబ్బులు కనిపించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/09/2023)
-
Koppula Harishwar Reddy: పరిగి ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఉపసభాపతి కన్నుమూత
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Rahul Gandhi: విద్వేష మార్కెట్‌లో ప్రేమ దుకాణం.. బీఎస్పీ ఎంపీని కలిసిన రాహుల్
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు