logo

Hyderabad: రూ.లక్ష డ్రా చేసి.. మరో బైక్‌లో పెట్టి మరిచి..

ఏటీఎంలో డ్రా చేసిన నగదును ఇతర ద్విచక్ర వాహనంలో పెట్టి మరిచిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 16 Dec 2022 09:14 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి నగదు ఇస్తున్న ఉప్పల్‌ ఎస్సై మైబెల్లి

ఉప్పల్‌, న్యూస్‌టుడే: ఏటీఎంలో డ్రా చేసిన నగదును ఇతర ద్విచక్ర వాహనంలో పెట్టి మరిచిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌లోని కల్యాణపురికి చెందిన గుజ్జరి అర్జున్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఈ నెల 12న రాత్రి ప్రశాంతినగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో రూ.1.10లక్షలు డ్రా చేసి బయటకొచ్చి తన ద్విచక్ర వాహనం అనుకొని ఇతర వాహనంలో డబ్బులు పెట్టేసి మళ్లీ ఏటీఎంలోకి వెళ్లారు. తర్వాత వాహనం మీద ఇంటికి చేరుకొని చూడగా డబ్బులు కనిపించలేదు. ఇతర వాహనంలో పెట్టినట్లుగా గుర్తొచ్చింది. పోలీసులను ఆశ్రయించగా సీసీ కెమెరాలు పరిశీలించారు. అదే సమయంలో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన వారి వివరాలను బ్యాంకు నుంచి రాబట్టారు. చిలుకానగర్‌కు చెందిన ఆలేటి అనిల్‌కుమార్‌ ఏటీఎంకు వచ్చినట్లు గుర్తించారు. గురువారం అనిల్‌కుమార్‌కు ఎస్సై ఫోన్‌ చేయగా తన బైక్‌లో డబ్బులు ఉన్నట్లుగా అంగీకరించారు. వెంటనే తెచ్చి ఠాణాలో అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని