Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

1. టీమ్‌ఇండియాకు సవాలే..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్న టీమ్‌ఇండియాకు జట్టులోని ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ నుంచి ఎంత త్వరగా బయటపడతారన్నదే అతిపెద్ద సవాల్ అని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘దాదాపుగా జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్ పూర్తిచేసుకుని వెళ్తున్నవాళ్లే. టీ20 ఫార్మాట్ నుంచి వాళ్లు బయటపడి టెస్టు ఫార్మాట్‌కు ఎంత త్వరగా సిద్ధమవుతారన్నదే అతిపెద్ద సవాల్. జట్టులోని ఆటగాళ్లలో ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్న పుజారా ఒక్కడే సుదీర్ఘ ఫార్మాట్‌కు సిద్ధంగా ఉన్నాడు’’ అని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రెండు భాగాలుగా ప్రభాస్ చిత్రం!
ప్రభాస్ సినిమా రెండు భాగాలుగా రూపొందడం కొత్తేమీ కాదు. ‘బాహుబలి’ సినిమాలు అలానే వచ్చి ప్రేక్షకుల్ని మెప్పించాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు కూడా ఒకొక్కటి రెండు భాగాలుగా రూపొందుతాయనే సంకేతాలొస్తున్నాయి. ఇవే కాదు... మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా కూడా రెండు భాగాలుగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. తలనొప్పిని తగ్గించే పానీయాలు
మనం ఎక్కువగా ఎదుర్కొనే ఇబ్బందుల్లో తలనొప్పి ఒకటి. దీనికి ఒత్తిడి, అలసట, విటమిన్ల లోపం, నిద్రలేమి.. లాంటి కారణాలెన్నో! ఇదిగో ఈ పానీయాలతో దానికి ఉపశమనం లభిస్తుందట. తులసి టీ... విటమిన్ కే, ఏ లు పుష్కలంగా ఉంటాయి. గుప్పెడు తులసి ఆకుల్ని రెండు కప్పుల నీటిలో వేసి కప్పు నీరు అయ్యేంత వరకూ మరిగించాలి. ఈ పానీయాన్ని టీ లా తాగాలి. ఇది తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అగ్నివీరులకు.. నౌకాదళం ఆహ్వానం..
ఇండియన్ నేవీ అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో 1365 పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అగ్నివీర్ (ఎంఆర్) వంద పోస్టులకు మరో ప్రకటన వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులు వీటికి అర్హులు. ఈ రెండు పోస్టులకూ మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, ఫిజికల్, మెడికల్ టెస్టులతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇలా అవకాశం వచ్చినవారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు సేవలు అందించవచ్చు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అడిగేదెవరు.. బాదెయ్..!
వేసవి రద్దీని పలు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు.డిమాండ్ ఉన్న రూట్లలో అందిన కాడికి దోచుకుంటున్నారు. సాధారణం కంటే 40 శాతం నుంచి 50 శాతం అధికంగా ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ధరలను చూసి ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లే వారు చేసేది లేక చెల్లిస్తున్నారు. ప్రయాణికుల వాహనాల్లో వాణిజ్య సరకులను చేరవేయకూడదు. వారికి సంబంధించిన వాటినే తీసుకెళ్లాలి. చాలా బస్సుల్లో డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టారీతిన సరకులను తీసుకెళ్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. 400 రకాల ఔషధ మొక్కలకు మధుమేహ నియంత్రణ సామర్థ్యం
రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే సామర్థ్యం దాదాపు 400 రకాల ఔషధ మొక్కలకు ఉందని భారత శాస్త్రవేత్తల బృందం తేల్చింది. అయితే వాటిలో వేప, పసుపు, ఉసిరి, నేరేడు, మెంతి వంటి 21 రకాలపైనే లోతైన పరిశోధనలు జరిగాయని పేర్కొంది. మధుమేహాన్ని నియంత్రించేందుకు వాడే అనేకరకాల అల్లోపతి ఔషధాలకూ మూలికా నేపథ్యం ఉంటోందని తెలిపింది. అందువల్ల సహజసిద్ధ ఉత్పత్తులపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తే మరిన్ని కొత్త మందుల అభివృద్ధికి వీలు కలుగుతుందని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీ నేపథ్యంలో నాలుగు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 1న కాచిగూడ-తిరుపతి(07061), జూన్ 2న తిరుపతి-కాచిగూడ(07062), జూన్ 3న కాచిగూడ-కాకినాడ(07417), జూన్ 4న కాకినాడ-కాచిగూడ(07418) రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ-తిరుపతి-కాచిగూడ రైళ్లు మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, కడప మార్గంలో.. కాచిగూడ-కాకినాడ-కాచిగూడ రైళ్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. శ్రీవారి ఆలయంలో ఐపీఎల్ ట్రోఫీ
మరింత ఆసక్తికరమైన మ్యాచ్‌లో, చివరి రెండు బందుల్లో ఊహించిన మలుపుతో చెన్నై జట్టు విజయాన్ని కైవసం చేసుకుని ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిని టీనగర్‌లోని శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఛైర్మన్ శ్రీనివాసన్, సీఎఫ్‌ఓ ఆర్ శ్రీనివాసన్, తితిదే స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ధరణిలో ఊరినే మాయం చేశారు
ధరణి పోర్టల్‌లో ఒక ఊరిని చేర్చడాన్ని అధికారులు మర్చిపోయారు. దీంతో అక్కడి పట్టాదారులు తమ భూముల క్రయవిక్రయాలకు, సర్వేలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఒకప్పుడు శేరిగూడ, భద్రాయపల్లిలు రెండు గ్రామాలుగా, రెండు రెవెన్యూ విభాగాలుగా ఉండేవి. భద్రాయపల్లిలో తక్కువ గృహాలు ఉండటంతో ఏళ్ల క్రితమే వారంతా శేరిగూడకు వచ్చేశారు. దీంతో ఒకే గ్రామంగా.. శేరిగూడ భద్రాయపల్లి పంచాయతీగా మార్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. దేవినేని ఉమా వైకాపాకు అనుకూల శత్రువు: వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్ జిల్లాలో వైకాపాకు అనుకూల శత్రువని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఆయన మాట్లాడారు. దేవినేని ఉమా గతంలో గ్రావెల్, ఇసుక అక్రమంగా దోచుకుని ఎదిగారన్నారు. ఒక్కసారి గెలిచిన కృష్ణప్రసాద్‌కు ఇంత బలుపా అంటున్నారని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమాపై 13 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గినందుకు తనకు బలుపేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IndiGo: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి ఆత్మహత్యాయత్నం..
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు