Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 Mar 2024 09:00 IST

1. మహా శివరాత్రి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి (Mahashivaratri) వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. పూర్తి కథనం

2. ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు

ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు  వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం  ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. ఆర్థిక  సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్న  వారు చేయకూడని పొరపాట్లేమిటో చూద్దాం...పూర్తి కథనం

3. బస్సు ఎక్కి దిగితే రూ.65

సీఎం జగన్‌ బహిరంగ సభ పుణ్యమా! అని ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిన బస్సులు అచ్యుతాపురం వైపు దారి మళ్లించారు. బస్సు ఎక్కి దిగితే రూ.65 చెల్లించాల్సి ఉంటుందని కండక్టర్లు చెప్పడంతో ప్రయాణికులు కంగుతిన్నారు. చాలా మంది బస్సులు దిగి ఆటోలను ఆశ్రయించారు.పూర్తి కథనం

4. హద్దు దాటి దోపిడీ

రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ చెక్‌పోస్టుల్లో దోపిడీ పర్వం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నెలకు సుమారుగా రూ.కోటి వరకు ప్రైవేటు సిబ్బందిని పెట్టి మరీ అధికారులు వసూలు చేస్తున్నారు. పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన చోదకుల జేబులను చెక్‌పోస్టు నిర్వాహకులు కొల్లగొడుతున్నారు.పూర్తి కథనం

5. అంబటి.. తప్పు కదా?

వైకాపా నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ప్రదేశంతో సంబంధం లేకుండా సీఎంకు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారు. వారు చేస్తే ఎవరూ కాదనరు.. కానీ లోకం తెలియని చిన్నారులను ఇందులో భాగస్వాములను చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.పూర్తి కథనం

6. జగనొస్తే జనానికి చుక్కలే!

తెలంగాణలో సీఎం కాన్వాయ్‌ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదు. అవసరమైతే తన కాన్వాయ్‌ ఆపి వాళ్లను స్వేచ్ఛగా వెళ్లనివ్వాలని’ అక్కడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. మరి ఏపీలో సీఎం జగన్‌ గాల్లో ప్రయాణించినా నేలపై రాకపోకలకు ఆంక్షలు పెడుతున్నారు. గతేడాది భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు విశాఖ నుంచి హెలికాప్టర్‌లో జగన్‌ వెళితే ఆ ప్రాంతానికి 150 కి.మీ దూరానున్న నక్కపల్లిలో భారీ వాహనాలను నిలిపేశారు.పూర్తి కథనం

7. భార్యను బెదిరించాలనుకుని.. నిజంగానే ఉరేసుకున్నాడు

భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో ఉరేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయిన ఘటన ఇది జవహర్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....శ్రీకాకుళం జిల్లాకు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు సింహాద్రి నాగరాజు (36), మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. బాలాజీనగర్‌ చంద్రపురికాలనీకి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. పూర్తి కథనం

8. ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్‌ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వనుంది. పూర్తి కథనం

9. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నకిలీ బోనఫైడ్లు..!

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్‌ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట సుమారు 350 మంది పత్రాలు నకిలీవిగా అనుమానించి పక్కనపెట్టారు. అనంతరం ప్రాథమిక విచారణలో 250 నిజమేనని తేలింది.పూర్తి కథనం

10 ఈ ‘టానిక్‌’కు ఇన్ని మినహాయింపులెందుకు..!

విదేశీ మద్యం విక్రయాల్లో పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని ‘టానిక్‌’ ఎలైట్‌ మద్యం దుకాణానికి అనుమతుల్లోనే మతలబులున్నట్లు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అన్నింటికీ రెండేళ్ల కాలపరిమితి ఉంటే.. టానిక్‌కు అయిదేళ్ల గడువుతో లైసెన్స్‌ జారీ చేయడమే కాకుండా విక్రయాల్లో పలు రాయితీలివ్వడం విస్తుగొలుపుతోంది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని