Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Mar 2024 21:04 IST

1.  ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూల స్పందన!

ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఏర్పాటు చేసిన ఈ భేటీలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవో, టీఎన్‌జీవో, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ సంఘాల నేతలు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైకాపా ‘సిద్ధం’ సభలో అపశ్రుతి.. ఇద్దరి మృతి

బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం సాయంత్రం జరిగిన వైకాపా ‘సిద్ధం’ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీఎం జగన్‌ సభాస్థలికి చేరుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పారిశుద్ధ్య కార్మికుడు ఉదరగుడి మురళి (30) మృతి చెందాడు. సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రంజీ ట్రోఫీ ఫైనల్‌.. తొలి రోజు ముంబయిదే జోరు

దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో 41సార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి.. రెండుసార్లు విజేతగా నిలిచిన విదర్భ తలపడుతున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో పవన్ కల్యాణ్‌ భేటీ

కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెదేపా, భాజపా, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు షెకావత్‌ ఆదివారం విజయవాడ చేరుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: డీకే అరుణ

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో 33 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతుందని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పొత్తులో ఎవరెక్కడ?.. ఆశావహుల్లో ఉత్కంఠ!

తెలుగుదేశం, భాజపా, జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. తెదేపా, జనసేన ఇప్పటికే తొలి జాబితాలో 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో.. మిగతా 76 చోట్ల ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భాజపాలో చేరిన పలువురు భారాస నేతలు

తెలంగాణలో భారాసకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు సీనియర్‌ నేతలు భాజపా గూటికి చేరారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు.. దిల్లీలో తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విజయనగరం జిల్లాలో పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు

విశాఖపట్నం నుంచి భవానీపట్న వెళ్లే ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మెయిన్‌ లైన్ నుంచి మిడిల్‌ లైన్‌కు వెళ్తున్న సమయంలో ఇంజిన్‌ పట్టాలు తప్పి అక్కడే ఆగిపోయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పదేళ్లలో 21 రెట్లు పెరిగిన మొబైల్‌ ఫోన్ల తయారీ విలువ

భారత్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీ విలువ పదేళ్లలో 21 రెట్లు పెరిగి రూ.4.1 లక్షల కోట్లకు చేరినట్లు ‘ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA)’ వెల్లడించింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం (PLI) వంటి ప్రభుత్వ విధానాలు.. దేశీయంగా తయారీ చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలకు ఉపకరించాయని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మార్చి 15 నాటికి ఇద్దరు కొత్త కమిషనర్లు!

కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) మార్చి 15 నాటికి ఇద్దరు కొత్త కమిషనర్లు నియామకమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ నేతృత్వంలో హోంశాఖ, సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శులతో కూడిన సెర్చ్‌ కమిటీ జాబితా సిద్ధం చేయనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని