Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల మృతి!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Updated : 10 May 2024 21:26 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపుర్‌ (Bijapur) జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగలూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనా స్థలం నుంచి 12 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, భద్రత సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

పాక్‌లోని ‘సోనల్‌’ కోసం.. సైనిక సమాచారం లీక్‌ చేసిన ఇంజినీర్‌..!

ఈ ఆపరేషన్‌ విజయవంతం కావడంపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్ భద్రత బలగాలను అభినందించారు. ఇదిలా ఉండగా.. గత నెల 16న కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన ఇది. అనంతరం ఏప్రిల్‌ 30న నారాయణ్‌పుర్‌, కాంకేర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌లో మరో 10 మంది మరణించారు. రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 103 మంది మావోయిస్టులు మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని