ఆ మూడు రోజులూ.. బెంగాల్‌ పూర్తి లాక్‌డౌన్‌

కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న వేళ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్‌ జోన్‌లలో  సెప్టెంబర్‌ 30 వరకు.............

Published : 01 Sep 2020 01:21 IST

కోల్‌కతా: కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న వేళ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్‌మెంట్‌ జోన్‌లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సెప్టెంబర్‌ 7, 11, 12 తేదీల్లో బెంగాల్‌ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హా వెల్లడించారు. స్థానికంగా లాక్‌డౌన్‌లు పెట్టకూడదంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ.. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించే తేదీలను కేంద్రం అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను ప్రకటించకముందే తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 

మెట్రో సర్వీసులను గ్రేడ్‌ల వారీగా సెప్టెంబర్‌ 8 నుంచి పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు మాత్రం మూసే ఉంచుతామని స్పష్టంచేశారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లు కాని ప్రాంతాల్లో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు సెప్టెంబర్‌ 21 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. 

బెంగాల్‌లో నిన్న ఒక్కరోజే 3019 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,59,785 మందికి కరోనా సోకగా. వారిలో 1,30,952 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,176మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 25,657 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. బెంగాల్‌లో రికవరీ రేటు 82శాతం కాగా.. మరణాల రేటు 2శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని