2021 గణతంత్ర వేడుకల అతిథి వీరేనా..?

2021 సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌

Updated : 29 Feb 2024 13:39 IST

బోరిస్‌ జాన్సన్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం

దిల్లీ: 2021 సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ విచ్చేయనున్నట్టు తెలుస్తోంది. నవంబర్‌ 27న టెలిఫోన్‌ సంభాషణ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు. కాగా, బ్రిటన్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న జీ-7 సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా జాన్సన్‌, భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ విషయమై అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ.. అంతా సక్రమంగా జరిగితే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వచ్చే ఏడాది జనవరి 26 నాటి గణతంత్ర సంబరాలకు ముఖ్య అతిధి కావచ్చని భావిస్తున్నారు. కాగా, భారత రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలకు హాజరైన కడపటి బ్రిటన్‌ ప్రధాని జాన్‌ మేజర్‌. ఈయన 1993లో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని