వావ్‌.. రెండు బంగారు ముద్దలు..!

బంగారు గనుల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులకు రెండు బంగారు మద్దలు దొరికాయి. వీటివిలువ అక్షరాలా 2,50,000 డాలర్లు. దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న ట్రాంగుల్లా బంగారు

Published : 21 Aug 2020 17:59 IST

సిడ్నీ: బంగారు గనుల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులకు రెండు బంగారు ముద్దలు దొరికాయి. వీటివిలువ అక్షరాలా 2,50,000 డాలర్లు. దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఉన్న ట్రాంగుల్లా బంగారు గని వద్ద బ్రెంట్‌ షానన్‌, ఇథన్‌ వెస్ట్‌ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని కనుగొన్నారు. ఈ విషయాన్ని ఆసిస్‌ గోల్డ్‌ హంటర్స్‌ అనే షోలో గురువారం ప్రసారం చేశారు. వీరిద్దరు మెటల్‌ డిటెక్టర్లను ఉపయోగించి వీటిని కనుగొన్నారు. ఒకే రోజు రెండు పెద్ద బంగారు ముద్దలను కనుగొనడం చాలా అరుదైన అంశమని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ రెండిటి బరువు కలిపి సుమారు 3.5 కిలోలుగా  తేల్చారు. 

ఈ విషయాన్ని ఓ టీవీ ఛానల్‌తో షానన్‌ పంచుకొన్నాడు. ఎవరూ ఇప్పటి వరకు తాకని భూమిని తాము బంగారం వెతికేందుకు ఎంచుకున్నామని తెలిపారు. ఇక వెస్ట్‌ మాట్లాడుతూ.. ‘దాదాపు  నాలుగేళ్ల నుంచి బంగారం వేటలో ఉన్నాను. చాలా చిన్నచిన్న ముక్కలు సేకరించాను. కానీ, ఇంత పెద్ద ముద్ద దొరకడం ఇదే తొలిసారి. బంగారం సేకరించేవారు ఇలాంటి ముద్దలకు దాదాపు 30శాతం అదనంగా చెల్లిస్తారు’ అని తెలిపారు. 2019లో ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తి 1.4 కిలోల బంగారం ముద్దను కనుగొన్నారు. అప్పట్లో దీని విలువ 69వేల డాలర్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు