ఆస్పత్రిలో చేరినవారందరికీ రెమ్‌డెసివిర్‌!

అమెరికాలో కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరిన వారందరికీ చికిత్సలో భాగంగా రెమ్‌డెసివిర్‌ మందును అందించేందుకు ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణా సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతించింది. ఈ విషయాన్ని గిలీద్‌ సైన్సెస్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.........

Published : 29 Aug 2020 14:56 IST

అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి

వాషింగ్టన్‌: అమెరికాలో కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరిన వారందరికీ చికిత్సలో భాగంగా రెమ్‌డెసివిర్‌ మందును అందించేందుకు ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతించింది. ఈ విషయాన్ని గిలీద్‌ సైన్సెస్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడి తీవ్ర లక్షణాలున్న వారికే ఈ డ్రగ్‌ను పరిమితం చేశారు. వివిధ స్థాయిల్లో లక్షణాలున్న వారిపై జరిపిన పరిశోధన ఫలితాల ఆధారంగానే రెమ్‌డెసివిర్‌ వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతించినట్లు అధికారులు తెలిపారు. మోతాదు లక్షణాలున్న వారికి రెమ్‌డెసివిర్‌ ఇవ్వగా.. 65 శాతం మంది ఐదు రోజుల్లో కోలుకున్నట్లు అధ్యయనంలో తేలిందని గిలీద్‌ తెలిపింది. 

భారత్‌లోనూ తీవ్ర లక్షణాలున్న కొవిడ్‌ బాధితులకు పరిశోధనాత్మక యాంటీ వైరల్‌ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో సిప్రెమీ పేరుతో సిప్లా, కొవిఫర్‌ పేరుతో హెటిరో, డెస్‌రెమ్‌ పేరిట మైలాన్‌ కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని