Tamil Nadu: ఈయనో ఎలక్షన్‌ కింగ్.. ఎన్నికల్లో ఏకంగా 227వ సారిపోటీ!

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఎన్నికల్లో 227వ సారి పోటీ చేస్తున్నారు. ‘ఎలక్షన్‌ కింగ్‌’గా సుపరిచితమైన కె.పద్మరాజన్ ఫిబ్రవరి 19న జరగనున్న

Published : 30 Jan 2022 01:44 IST

చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఎన్నికల్లో 227వ సారి పోటీ చేస్తున్నారు. ‘ఎలక్షన్‌ కింగ్‌’గా సుపరిచితమైన కె.పద్మరాజన్ ఫిబ్రవరి 19న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. పోటీకి సంబంధించి ఎన్నికల పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. నామినేషన్  ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా.. అందరి కన్నా ముందే పద్మరాజన్ నామపత్రాలు దాఖలు చేశారు. అత్యధికసార్లు పోటీ చేసిన పద్మరాజన్.. అత్యధిక సార్లు ఓడిపోయి కూడా రికార్డులకెక్కారు. 1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఆ తర్వాత మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయిపై లఖ్‌నవూలో, పీవీ నరసింహారావుపై నంద్యాలలో పోటీ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీపై పోటీ చేశారు. 62 ఏళ్ల పద్మరాజన్ ప్రస్తుతం వీరక్కల్ పూడూర్ నుంచి బరిలోకి దిగనున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని