Kota: విద్యార్థుల బలవన్మరణాలు.. కోటా యంత్రాంగం కీలక నిర్ణయం

కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ కోటాలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 28 Aug 2023 14:03 IST

జైపుర్‌: పోటీ పరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలలపాటు కోటాలోని శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి టెస్టులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సెప్టెంబరు, అక్టోబరులో విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. 

మరోవైపు విద్యార్థుల బలవన్మరణాలను ఆపేందుకు కోటాలోని వసతి గృహాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ కాయిల్‌ ఫ్యాన్లు అమర్చుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి వసతి గృహాల యజమానులు ఈ చర్యలు తీసుకొంటున్నారు. భవనాల పై అంతస్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఆవరణల్లోనూ వలలు కడుతున్నారు.

నీ ఆటోగ్రాఫ్‌ ఇస్తావా..? చిన్నారిని అడిగిన రాహుల్

ఆదివారం మధ్యాహ్నం తాను కోచింగ్‌ తీసుకుంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి మహారాష్ట్రకు చెందిన అవిష్కర్‌ శంభాజీ కస్లే (17) అనే విద్యార్థి దూకేయగా.. సాయంత్రం బిహార్‌కు చెందిన ఆదర్శ్‌ రాజ్‌ (18) అనే మరో విద్యార్థి అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వీరి మృతితో.. ఈ ఏడాది ఇప్పటివరకూ కోటాలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య 22కు పెరిగింది. అవిష్కర్‌ ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాలు వసతి గృహం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని