‘చెస్‌ ఆడుతున్నట్లు పోజిచ్చా అంతే’.. హనీమూన్‌ నాటి ఫొటో షేర్‌ చేసిన మహీంద్రా

తన పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనంద్‌ మహీంద్రా చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ఆయన చెస్‌ ఆడుతున్నట్లు కన్పించారు. 

Updated : 22 Jul 2023 13:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తాజాగా ఓ పోస్ట్‌ చేశారు. ‘ఇంటర్నేషనల్‌ చెస్‌ డే’ను పురస్కరించుకుని తాను చెస్‌ (Chess) ఆడుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. అయితే, అది తన హనీమూన్‌ నాటి ఫొటో అట. ఈ విషయాన్ని చెబుతూ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్‌ (Viral Photo) అవుతోంది.

‘‘గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ (Global Chess League) జరిగినప్పుడు.. ‘ఎప్పుడైనా చెస్‌ ఆడారా?’ అని నన్ను చాలా మంది అడిగారు. దీంతో నేను నా పాత జ్ఞాపకాల ఆల్బమ్‌ను శోధించగా ఈ ఫొటో దొరికింది. ఇది ఆగ్రాలో నా హనీమూన్‌లో తీసుకున్న ఫొటో. రోబోటిక్‌ చెస్‌ బోర్డుపై ఆడలేదు. నా భార్య కెమెరా కోసం కేవలం పోజిచ్చానంతే..! అయితే ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో నా చెస్‌ నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) రాసుకొచ్చారు.

అద్భుతాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీ.. లెక్కల్లో మాత్రం బాగా వీక్‌!

ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ ఫొటోను దాదాపు 3లక్షల మంది వీక్షించారు. ‘మీ థ్రో బ్యాక్‌ ఫొటో బాగుందం’టూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ను ఈ ఏడాది తొలిసారిగా టెక్‌ మహీంద్రా, అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ సంయుక్తంగా నిర్వహించింది. ఇందులో ఆరు ఫ్రాంఛైజీలు ఉంటాయి. ఈ ఏడాది జూన్‌ 21 నుంచి జులై 2 వరకు దుబాయ్‌ వేదికగా ఈ పోటీలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని