Chat GPT: అద్భుతాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీ.. లెక్కల్లో మాత్రం బాగా వీక్!
వివిధ అంశాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న చాట్‌జీపీటీ గణితంలో మాత్రం వెనకబడిపోతున్నట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది.
ఇంటర్నెట్‌డెస్క్: సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న చాట్‌జీపీటీ (Chat GPT) రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది. ఓపెన్ ఏఐ సృష్టించిన ఈ కంప్యూటర్ అప్లికేషన్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ఎంత పెద్ద ప్రశ్నకైనా అవలీలగా సమాధానం చెప్పేస్తోంది. అయితే, ఈ చాట్‌జీపీటీ గణితంలో మాత్రం వెనకబడి ఉందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. గణిత సమీకరణాల సాధనలో కాలక్రమేణా చాట్‌జీపీటీ తడబడుతోందని, దీని సామర్థ్యం కూడా తగ్గుతోందని అధ్యయనం వెల్లడించింది. పరిశోధనలో భాగంగా జీపీటీ 3.5, జీపీటీ 4 వెర్షన్ల పని తీరును పరిశోధకులు బేరీజు వేశారు. గణిత సమస్యలు, సాఫ్ట్‌వేర్ కోడ్ జనరేషన్‌తోపాటు కొన్ని సున్నితమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంపై ఈ రెండు వెర్షన్ల పని తీరును సరిపోల్చారు.
ఫార్చ్యూన్ మ్యాగజీన్ వెల్లడించిన వివరాల మేరకు.. గణిత సంబంధిత టాస్క్‌లపై క్రమంగా చాట్‌జీపీటీ పట్టు కోల్పోతోంది. సమస్యను సాధించడంలో క్లిష్టపరిస్థితి నెలకొంటోంది. నిర్దిష్ట పనులను నిర్వహించే సాంకేతిక సామర్థ్యం కాలక్రమేణా అనూహ్య మార్పులకు గురవుతోంది. జీపీటీ-4 ఖచ్చితత్వం మార్చిలో 97.6 శాతం ఉండగా.. జూన్ నాటికి అది అనూహ్యంగా 2.4శాతానికి పడిపోయింది. అయితే, జీపీటీ 3.5 మోడల్ స్పందన దీనికి భిన్నంగా ఉంది. అవే పనుల్లో ఖచ్చితత్వం మార్చిలో 7.4శాతం నుంచి జూన్‌లో 86.8 శాతానికి మెరుగుపడినట్టు గుర్తించారు.
చాలా రోజులుగా జీమెయిల్ వాడటం లేదా? ఈ అలర్ట్ మీ కోసమే!
సాఫ్ట్‌వేర్ కోడ్ జనరేషన్, విజువల్ రీజనింగ్ సమస్యల సాధనలోనూ ఇదే రకమైన ఫలితాలు వచ్చినట్లు స్టాన్‌ఫోర్డ్ సైన్స్ ప్రొఫెసర్ జేమ్స్ జోవ్ వెల్లడించారు. చాట్‌జీపీటీ సామర్థ్యం ఇంతలా బలహీన పడుతుందని ఊహించలేదని ఆయన అన్నారు. ఫలితాల్లో అస్థిరతకు జీపీటీ మోడల్స్ కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ప్రయత్నించినప్పుడు జీపీటీ ఊహించని పరివర్తనలకు లోనవుతోందని, అందువల్లే సామర్థ్యం అనూహ్యంగా తగ్గిపోవడంతోపాటు, ఫలితాల్లోనూ స్పష్టత కొరవడుతోందని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కాలక్రమేణా మార్పులకు లోనవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటినే డ్రిఫ్ట్‌లు అంటారు. ఇవి ఒక్కో మోడల్‌పై ఒక్కోలా పని చేస్తాయి. వివిధ అంశాలపై జీపీటీ సమర్థతను నిర్ధారించుకోవడానికి తరచూ వాటిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం నొక్కి చెబుతోంది. అలా చేయడం వల్ల డ్రిఫ్ట్ కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తితే తక్షణమే వాటిని పరిష్కరించుకునేందుకు వీలు పడుతుందని అధ్యయనం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Demat nominee: డీమ్యాట్ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు