బర్డ్‌ఫ్లూపై అసత్యాలను ప్రచారం చేయకండి

దేశంలోని పలు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తున్న ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)పై ప్రజలు అసత్యాలను ప్రచారం చేయొద్దని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్ కోరారు.

Published : 11 Jan 2021 20:17 IST

ప్రజలను కోరిన కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి
దేశంలోని పదిరాష్ట్రాలకు పాకిన వైరస్‌

దిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తున్న ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)పై ప్రజలు అసత్యాలను ప్రచారం చేయొద్దని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్ కోరారు. ఈ వైరస్‌ వల్ల మానవులకు ఏ విధమైన హాని జరగదన్నారు. పౌల్ట్రీ పదార్ధాలు బాగా ఉడికించి తినాలని ఆయన సూచించారు. ‘‘ బర్డ్‌ఫ్లూ గురించి ప్రజలంతా భయపడుతున్న సమయంలో వదంతులను వ్యాప్తి చేయొద్దు. 2006 నుంచి అప్పుడప్పుడు బర్డ్‌ఫ్లూ కేసులు వస్తూనే ఉన్నాయి. దీని వల్ల మనుషులకు ఏ విధమైన ముప్పులేదు.’’ అని  తెలిపారు. 
పది రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ..
దేశంలో బర్డ్‌ఫ్లూ సంక్రమించిన రాష్ట్రాల సంఖ్య పదికి చేరినట్లు కేంద్రం వెల్లడించింది. దిల్లీ, మహరాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ బర్డ్‌ఫ్లూను గుర్తించినట్లు తెలిపారు. దేశరాజధాని దిల్లీలో బర్డ్‌ఫ్లూను గుర్తించిన నేపథ్యంలో ఘాజీపూర్‌ పౌల్ట్రీ మార్కెట్‌ను 10 రోజుల పాటు మూసేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సూచించామని మంత్రి‌ తెలిపారు.

ఇవీ చదవండి..

స్పుత్నిక్‌ టీకా ఎంతమంది తీసుకున్నారంటే..

ఫ్రంట్‌లైన్‌ యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని