CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 విద్యార్థులకు టర్మ్‌-2 పరీక్షలు ఎప్పట్నుంచంటే?

ఈ పరీక్షల నిర్వహణపై పలువురు లబ్ధిదారులతో చర్చించిన తర్వాత దేశంలోని కొవిడ్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సెకండ్‌ టర్మ్‌ పరీక్షలను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో మాత్రమే నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందని తెలిపారు. .....

Published : 10 Feb 2022 01:36 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్ని ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనే నిర్వహించనున్నట్టు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. ఈ పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దేశంలోని కొవిడ్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సెకండ్‌ టర్మ్‌ పరీక్షలను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో మాత్రమే నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందని తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభమవుతాయనీ.. 10, 12వ తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.  బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచిన శాంపిల్‌ క్వశ్చన్‌ పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రం ప్యాట్రన్‌ ఉంటుందన్నారు. 

మరోవైపు, కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) గతేడాది జులై 5న  ప్రత్యేక మదింపు విధానాన్ని ప్రకటించింది. అకాడమిక్‌ సెషన్‌ను రెండు భాగాలుగా విభజించి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. టర్మ్‌-1 పరీక్షలను గతేడాది నవంబరు-డిసెంబరులో, టర్మ్‌-2 పరీక్షలను వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించాలని సీబీఎస్‌ఈ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఇటీవల టర్మ్‌ 1 పరీక్షలు నిర్వహించిన బోర్డు.. టర్మ్‌-2 పరీక్షలను ఏప్రిల్‌ 26 నుంచి నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని