Loan Apps: 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా!
దా‘రుణ’ యాప్‌లపై కేంద్రం కొరడా! చిన్న చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకొనే సామాన్య ప్రజల్ని దోపిడీ చేసి, తీవ్ర వేధింపులకు గురిచేస్తోన్న రుణ యాప్‌ల(Loan Apps) తో పాటు బెట్టింగ్ యాప్(Betting apps)లపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కేంద్రం చర్యలు తీసుకుంది!
దిల్లీ: దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తూ ప్రజలను ఆకర్షించి ఆ తర్వాత వారి మానసిక వేదనకు కారణమవుతున్న రుణ(Loan apps), బెట్టింగ్ యాప్(Betting apps)లపై కొరడా ఝళిపించేందుకు కేంద్రం రంగం సిద్ధమైంది. ఈ యాప్‌ల ద్వారా చిన్న మొత్తంలో రుణాలు పొందిన సామాన్యుల్ని ఘోరంగా దోపిడీకి, వేధింపులకు గురిచేసి అనేకమంది ఆత్మహత్యలకు దారితీస్తోన్న ఈ దా‘రుణ’ యాప్‌ల వ్యవహారంపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్ యాప్‌లు, 94 రుణ చెల్లింపుల యాప్‌లను అత్యవసర ప్రాతిపదికన నిషేధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖకు హోంశాఖ వ్యవహారాల శాఖ నుంచి ఈ వారంలో ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఈ యాప్‌లను బ్లాక్ చేసే ప్రక్రియను ఇప్పటికే కేంద్ర ఐటీశాఖ ప్రారంభించినట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం.
ఐటీ చట్టం(IT act)లోని సెక్షన్ 69 ప్రకారం ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని నిర్థారణకు వచ్చిన తర్వాత ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. చైనా వ్యక్తులు ఈ యాప్‌లకు డైరెక్టర్లుగా భారతీయుల్ని నియమించి తమ వ్యూహాలను అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిరాశకు గురైన వ్యక్తులు ఈ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకొనేందుకు ఆకర్షితలవుతున్నారు.. ఆ తర్వాత యాప్ నిర్వాహకులు ఏటా దాదాపు 3వేల శాతం మేర వడ్డీని పెంచేస్తున్నారు. రుణం తీసుకున్నవారు ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల వడ్డీని చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఈ యాప్‌లకు చెందిన ప్రతినిధులు వారిపట్ల చాలా దారుణంగా వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి అసభ్యకరమైన సందేశాలు పంపడంతో పాటు వారి ఫోన్‌లో ఉన్న ఫొటోలను తీసుకొని మార్ఫింగ్ చేసి వాటిని బయటపెడతామని బెదిరించడం వంటి కిరాతక చర్యలకు పాల్పడుతున్నారు.
మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రుణాలు తీసుకున్నవారు లేదా బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకొని కొందరు ఆత్మహత్యలకు పాల్పడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సైతం ఈ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరడంతో.. రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ గత ఆరు నెలల క్రితం 28 చైనా రుణ చెల్లింపు యాప్‌లను విశ్లేషించింది. అయితే, 94 యాప్‌లు ఈ-స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నట్టు గుర్తించింది. ఇదిలా ఉండగా.. 2020 జూన్ నుంచి కేంద్ర ప్రభుత్వం 2వేలకు పైగా చైనా యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీటిలో టిక్‌టాక్, షేరిట్, వియ్‌చాట్, హలో, లైకీ, యూసీ న్యూస్, బిగో లైవ్, యూసీ బ్రౌజర్ తదితర అనేక యాప్‌లు ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్‌లైన్‌లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’