Satyendar Jain: జూన్‌ 18 వరకు జైల్లోనే సత్యేంద్ర జైన్‌

మనీలాండరింగ్ (money laundering) కేసులో అరెస్టయిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) మరో నాలుగు రోజులు జైల్లోనే గడపనున్నారు........

Published : 15 Jun 2022 00:06 IST

దిల్లీ: మనీలాండరింగ్ (money laundering) కేసులో అరెస్టయిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) మరో నాలుగు రోజులు జైల్లోనే గడపనున్నారు. జైన్‌ బెయిల్ పిటిషన్‌పై కోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేయడంతో జూన్ 18 వరకు ఆయన జైలు జీవితం గడపనున్నారు. జైన్‌ సహా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) వాదనలు విన్న అనంతరం స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ఉత్తర్వులను జూన్ 18కి రిజర్వ్ చేశారు.

కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలోనే దాదాపు సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆయన్ను అరెస్టు చేసింది. జైన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా.. దానిని జూన్ 13 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని