Vice President: ఉపరాష్ట్రపతి వేతనం ఎంతో తెలుసా?

 దేశ తదుపరి ఉపరాష్ట్రపతి (Vice President) ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ పదవికి నేడు ఓటింగ్ జరుగుతోంది. ఎన్డీయే కూటమి తరఫున  పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep dhankhar),

Published : 06 Aug 2022 16:49 IST

దిల్లీ: దేశ తదుపరి ఉపరాష్ట్రపతి (Vice President) ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ పదవికి నేడు ఓటింగ్ జరుగుతోంది. ఎన్డీయే కూటమి తరఫున  పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep dhankhar), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ ఆళ్వా (Margaret Alva) పోటీలో ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియనుండగా.. రాత్రికల్లా ఫలితం వెల్లడికానుంది. ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున అధికారిక కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖఢ్‌ గెలుపు దాదాపు లాంఛనమే. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వేతనం (Salary), వారికుండే సదుపాయాల గురించి తెలుసుకుందాం.

* ఉపరాష్ట్రపతి నెలవారీ వేతనం రూ.4లక్షలు. అంతకుముందు నెలకు రూ.1.25లక్షల వేతనం ఉండగా.. 2018 బడ్జెట్‌లో దీన్ని రూ.4లక్షలకు పెంచారు.

* ఉపరాష్ట్రపతికి వేతనంతో పాటు ఉచిత వైద్యం, రైళ్లు, విమానాల్లో ఉచిత ప్రయాణాలు వంటి ఇతర సదుపాయాలూ ఉంటాయి.

* ఉచిత ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ ఫోను కనెక్షన్లు ఇస్తారు. వ్యక్తిగత భద్రత, సిబ్బందిని కూడా ప్రభుత్వమే నియమిస్తుంది.

* ప్రస్తుతం దిల్లీలోని మౌలానా ఆజాద్‌ రోడ్‌లో ఉపరాష్ట్రపతి భవన్‌ ఉంది. అందులోనే ఉపరాష్ట్రపతి నివసిస్తారు.

ఒకవేళ ఏదైనా కారణాలతో రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు రాష్ట్రపతికి అందే వేతనం, ఇతర సదుపాయాలు లభిస్తాయి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తారు.

* పదవీ విరమణ తర్వాత ఉపరాష్ట్రపతికి తమ వేతనంలో 50శాతం పింఛనుగా లభిస్తుంది. దీంతో పాటు ఇతర సదుపాయాలు కూడా కొనసాగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని