Delhi: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. దిల్లీని తాకిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావం చుట్టుపక్కల దేశాల్లో కూడా కనిపించింది.    

Updated : 11 Jan 2024 17:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఈ విషయాన్ని ‘జాతీయ భూకంప అధ్యయన కేంద్రం’ వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియరాలేదు. దక్షిణాసియాలోని ముఖ్యదేశాల్లో దీని ప్రభావం కనిపించింది. దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం భూప్రకంపనలు వచ్చాయి. దీంతోపాటు జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లా, దక్షిణ పీర్‌ పంజాల్‌ ప్రాంతం, పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కూడా దీని తీవ్రత కనిపించింది. నిన్న కూడా అఫ్గానిస్థాన్‌లో 4.1 తీవ్రతతో భూమి కంపించింది. 

మైగ్రేన్‌ బాధితుల దృష్టి సంబంధ ఇబ్బందులకు కారణమిదే..!

సాధారణంగా భూకంపాలు ఆసియా ఖండంలో అధికంగా వస్తుంటాయి. అందులోనూ భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, తజకిస్థాన్‌లు హింద్‌ కుష్‌ హిమాలయాన్‌ జోన్‌కు చుట్టుపక్కల వీటి కేంద్రాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు నమోదయ్యే జోన్ల జాబితాలో ఇది కూడా ఒకటి. భారత ఉపఖండ భూఫలకం యూరేషియా ఫలకంతో ఢీకొనడమే దీనికి ప్రధాన కారణం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని