EC: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ రాజీనామా

లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ అనూహ్య పరిణామం. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ రాజీనామా చేశారు.

Updated : 09 Mar 2024 21:41 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపించిన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం (EC) కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ (Arun Goel) రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆయన పదవీకాలం 2027 డిసెంబరు వరకు ఉంది. అయితే.. రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు.

ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ

1985 పంజాబ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి గోయల్‌.. 2022 నవంబరులో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులయ్యారు. ఫిబ్రవరిలో అనుప్ పాండే పదవీ విరమణ, ప్రస్తుతం గోయల్ రాజీనామాతో.. ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని