Goa: 3గంటల పాటు భారీ ట్రాఫిక్‌ జామ్‌.. ఫ్లైట్‌ మిస్సైన పలువురు ప్రయాణికులు!

గోవా(Goa)లో నెలకొన్న భారీ ట్రాఫిక్‌ జామ్‌(Heavy Traffic Jam)తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ స్వల్ప రోడ్డు ప్రమాదంతో మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కొందరు ఫ్లైట్‌ మిస్‌ కాగా.. మరికొందరు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేక అవస్థలు పడ్డారు.

Published : 05 Dec 2022 16:35 IST

పనాజీ: గోవా(Goa)లో నెలకొన్న భారీ ట్రాఫిక్‌ జామ్‌(Heavy Traffic Jam)తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ స్వల్ప రోడ్డు ప్రమాదంతో మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కొందరు ఫ్లైట్‌ మిస్‌ కాగా.. మరికొందరు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేక అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం పనాజీకి 15కి.మీల దూరంలో జువారీ బ్రిడ్జిపై ఓ టెంపో వాహనం ఎస్‌యూవీని ఢీకొట్టడంతో జాతీయ రహదారిపై వాహనాలు కి.మీల మేర బారులు తీరినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగి ప్రత్యేక క్రేన్లతో ఆ వాహనాలను అక్కడి నుంచి తొలగించినట్టు తెలిపారు.

‘‘మేం మార్గోవ్ నుంచి పనాజీకి వెళ్తుండగా మూడు గంటల పాటు ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయాం. రద్దీ అధికంగా ఉండటంతో పాటు వంతెన దాటే అవకాశం లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని తన పిల్లలతో కలిసి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కేదార్‌ మాపెక్సెంకార్‌ అనే ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తెలిపారు. అలాగే, పనాజీ నుంచి దబోలిమ్‌ విమానాశ్రయానికి వెళ్తున్న అవిత్‌ నర్వేకర్‌ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ కారణంగా తాను ముంబయి వెళ్లాలసిన విమానం మిస్సైనట్టు తెలిపారు. సమయానికి కంటే ముందే బయల్దేరినప్పటికీ ఎయిర్‌పోర్టుకు చేరుకోలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, దీనిపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ అధికారులు స్పందిస్తూ.. విమానాశ్రయానికి చేరుకోవడంలో జాప్యంతో విమానం మిస్సయినట్టు తమకు ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని