ఇంట్లో అలిగి కార్లో ఉడాయించిన 5ఏళ్ల బాలుడు
అది అమెరికాలోని ఉటా రాష్ట్రం. సాధారణ తనీఖీల్లో భాగంగా అక్కడి పోలీసులు రోడ్డుపై వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అలా వారు ఓ కారును ఆపారు. అయితే అందులోని వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి....
న్యూయార్క్: అది అమెరికాలోని ఉటా రాష్ట్రం. సాధారణ తనీఖీల్లో భాగంగా అక్కడి పోలీసులు రోడ్డుపై వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అలా వారు ఓ కారును ఆపారు. అయితే అందులోని వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అతడిని ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నించారు. అందుకు అతడు చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టారు. ఎందుకంటే కారులో ఉన్న అతడి వయస్సు ఐదేళ్లు! ఆశ్చర్యంగా ఉందా? అయితే మీరూ చదివేయండి..
ఉటా రాష్ట్రానికి చెందిన ఐదేళ్ల బాలుడు తన తల్లిని రెండు కోట్లు ఖరీదుచేసే లాంబోర్గిని కారు కొనివ్వాలని అడిగాడు. అందుకు బాలుడి తల్లి నిరాకరించింది. దీంతో తల్లి మీద అలిగిన బాలుడు ఆమె కారును సొంతగా నడుపుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు. హైవేపైన పోలీసులు ఆపడంతో అసలు విషయాన్ని వెల్లడించాడు. తాను అడిగిన లాంబోర్గిని కారు కొనిచ్చేందుకు తన తల్లి నిరాకరించిందని, అందుకే తన వద్ద ఉన్న మూడు డాలర్లతో కారు కొనేందుకు కాలిఫోర్నియా బయలుదేరినట్లు తెలిపాడు. ఆ సమాధానంతో ఆశ్చర్యపోయిన పోలీసులు, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు చేసిన పనికి కేసు నమోదు చేయాలా? వద్దా? అనేది స్థానిక న్యాయస్థానం నిర్ణయిస్తుందని ఉటా పోలీసులు తెలిపారు. అయితే, బాలుడి తల్లిదండ్రులు మాత్రం తాము పనిలో ఉండగా తమను ఏమార్చి బయటికి వచ్చాడని, గతంలో ఎప్పుడూ అతడు కారు నడపలేదని చెప్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపట్ల మరింత జాగ్రత్తతో వ్యవహరించాలనేందుకు ఇదో చక్కని ఉదాహరణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్‌డ్రైవ్‌లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్‌లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్‌లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్‌లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్‌పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్‌లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్‌లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్‌లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్‌లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి