హిమాచల్‌లో నేడు కేసుల్లేవ్‌!

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా విళయతాండవం చేస్తుండగా హిమాచల్‌ ప్రదేశ్‌లో తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో..

Published : 05 Jul 2020 23:42 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటివరకు 1,046 మంది వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం 326 యాక్టివ్‌ కేసులు ఉండగా 9 మంది మృతిచెందినట్లు ఆదివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. హిమాచల్‌లోని కాంగ్ర జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 283 మంది మహమ్మారి బారిన పడగా ఇంకా 186 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇద్దరు మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటివరకు 6.73 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 4.1 లక్షల మంది కోలుకోగా 773 మంది వైరస్‌తో మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని