కరోనా సన్నద్ధతపై ముగిసిన మాక్‌డ్రిల్‌

కొవిడ్‌ వ్యాప్తితో తలెత్తే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ముందస్తు సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దేశవ్యాప్తంగా మంగళవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

Published : 28 Dec 2022 05:00 IST

దిల్లీ: కొవిడ్‌ వ్యాప్తితో తలెత్తే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ముందస్తు సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దేశవ్యాప్తంగా మంగళవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ ఆరోగ్య వసతులు, ఐసోలేషన్‌ బెడ్లు, ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూ- వెంటిలేటర్‌ బెడ్లు, వైద్యులు, సహాయ సిబ్బంది లభ్యత, అంబులెన్సులు, పరీక్షా పరికరాలు, అత్యవసరమైన మందులు తదితర అంశాలపై సన్నద్ధతను పరీక్షించారు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో జరిగిన మాక్‌డ్రిల్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు. మరోవైపు.. దేశంలో గత 24 గంటల్లో 157 మందికి కొవిడ్‌ సోకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని