ఆదిత్యుడిపై అధ్యయనానికి ముందడుగు

సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహంలో ఉపయోగించే ఏడు పేలోడ్‌ల్లో ఒకటైన ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)’ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ) అందించనుంది.

Published : 26 Jan 2023 05:40 IST

నేడు వీఈఎల్‌సీ అందించనున్న ఐఐఏ

ఈనాడు, బెంగళూరు: సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహంలో ఉపయోగించే ఏడు పేలోడ్‌ల్లో ఒకటైన ‘విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)’ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ) అందించనుంది. బెంగళూరు పరిసరాల్లోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(క్రెస్ట్‌)లో గురువారం ఈ భారీ పేలోడ్‌ను ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌కు అందిస్తామని ఐఐఏ ప్రకటించింది. వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబరులో ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 400 కిలోల బరువున్న ఆదిత్య ఎల్‌-1 భూస్థిర కక్ష్యకు దిగువన 800 కిలోమీటర్లు, భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండేలా ప్రయోగిస్తారు. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఆన్‌బోర్డ్‌ మిషన్‌లో వీఈఎల్‌సీతో పాటు సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లు కూడా అమరుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని