Kiren Rijiju: కొలీజియం అంశం.. ఓ మైండ్‌ గేమ్‌: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థపై తనకున్న ప్రతికూలమైన అభిప్రాయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మరోసారి వ్యక్తం చేశారు.

Updated : 23 Apr 2023 09:23 IST

ఇటానగర్‌: సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థపై తనకున్న ప్రతికూలమైన అభిప్రాయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మరోసారి వ్యక్తం చేశారు. కొలీజియం అంశం గురించి మాట్లాడను అంటూనే....‘అదంతా ఓ మైండ్‌ గేమ్‌’ అని వ్యాఖ్యానించారు. వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలు సహా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన పలు సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయమై విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘కొలీజియం అంశమంతా ఓ మైండ్‌ గేమ్‌. దాని గురించి మాట్లాడదలచుకోలేదు’ అని రిజిజు శనివారం ఇటానగర్‌లో అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 4జీ సేవల కోసం నిర్మించిన 254 మొబైల్‌ టవర్లను ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కొలీజియం వ్యవస్థ అనేది రాజ్యాంగంలోనే లేదని, న్యాయమూర్తులే న్యాయమూర్తులను ఎంపిక చేసే విధానాన్ని మార్చాలని కిరణ్‌ రిజిజు తరచూ వ్యాఖ్యానించే విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు