అదానీ ఇంటికి శరద్‌ పవార్‌

విపక్ష కూటమిలో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ కలకలం రేపారు. శనివారం ఆయన అహ్మదాబాద్‌ వెళ్లి పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని కలిశారు. అదానీ సంస్థకు చెందిన ఓ ఫ్యాక్టరీని ప్రారంభించారు.

Published : 24 Sep 2023 08:03 IST

దిల్లీ: విపక్ష కూటమిలో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ కలకలం రేపారు. శనివారం ఆయన అహ్మదాబాద్‌ వెళ్లి పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని కలిశారు. అదానీ సంస్థకు చెందిన ఓ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం అదానీ నివాసం, కార్యాలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఈ కొత్త కర్మాగారాన్ని ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదానీ, పవార్‌లు కలుసుకోవడం కొత్త కాదు. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత విపక్షాలన్నీ అదానీ గ్రూప్‌ సంస్థలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తున్న తరుణంలోనూ పవార్‌ నివాసానికి అదానీ వెళ్లి కలిశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆధారంగా అదానీపై చెలరేగుతున్న విమర్శలను పవార్‌ తప్పుపట్టారు. అతనికి మద్దతుగా నిలిచారు. ఈ ఏడాది జూన్‌లో కూడా పవార్‌ను అదానీ కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు