COVID subvariant JN.1: కేరళలో కొవిడ్‌ ఉపరకం జేఎన్‌.1

కొవిడ్‌-19లోని జేఎన్‌.1 అనే ఉపరకం కేరళలో వెలుగు చూసింది. భారత సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకోగ్‌) నిర్వహించిన పరిశీలనల్లో ఇది బయటపడింది.

Updated : 17 Dec 2023 08:31 IST

మహిళలో వెలుగుచూసిన కొత్త సబ్‌ వేరియంట్‌

దిల్లీ: కొవిడ్‌-19లోని జేఎన్‌.1 (COVID subvariant JN.1) అనే ఉపరకం కేరళలో వెలుగు చూసింది. భారత సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకోగ్‌) నిర్వహించిన పరిశీలనల్లో ఇది బయటపడింది. ‘‘79 ఏళ్ల బాధితురాలిలో ఈ కొత్త సబ్‌ వేరియంట్‌ కనిపించింది. నవంబరు 19న నిర్వహించిన ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో ఆమెకు కొవిడ్‌ సోకినట్లు వెల్లడైంది. ఆ నమూనాలో జేఎన్‌.1 ఉపరకం ఉన్నట్లు ఈ నెల 8న తేలింది. బాధితురాలిలో ఇన్‌ఫ్లూయెంజా తరహా లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ఆమె కొవిడ్‌ నుంచి కోలుకుంది. జేఎన్‌.1 ఉపరకం.. తొలిసారిగా ఈ ఏడాది సెప్టెంబరులో అమెరికాలో వెలుగు చూసింది’’ అని  తెలిపారు. చైనా సహా పలు దేశాల్లో జేన్‌.1 కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త టీకాలు, చికిత్సలతో ఈ ఉపరకం నుంచి రక్షణ పొందొచ్చని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని