‘భవిష్యత్తును ఊహించగలను’

నా విజయ రహస్యం ఏమిటని చాలామంది అడుగుతుంటారు. వారందరికీ నేను సమాధానం చెప్పను.

Published : 09 Mar 2024 05:17 IST

జాతీయ పురస్కారాల ప్రదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

దిల్లీ: ‘‘నా విజయ రహస్యం ఏమిటని చాలామంది అడుగుతుంటారు. వారందరికీ నేను సమాధానం చెప్పను. ఎక్కడైనా రెస్టారెంట్‌ యజమాని తన వంటశాలను చూపిస్తాడా? నాపై ఈశ్వరుడి కృప ఉంది. భవిష్యత్తులో జరగబోయేదానిని నేను ముందే ఊహించగలను’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘నేషనల్‌ క్రియేటర్స్‌’ (జాతీయ సృష్టికర్తల) పురస్కారాలను విజేతలకు శుక్రవారం దిల్లీలోని భారత మండపంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేది తామేనని, వచ్చే ఏడాది శివరాత్రికి కూడా ఈ అవార్డులను తానే అందిస్తానని ధీమా వ్యక్తంచేశారు. ‘కంటెంట్‌ క్రియేటర్లు’ మన దేశానికి డిజిటల్‌ రంగంలో రాయబారులని చెప్పారు. ‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంపై ప్రపంచానికి సృజనాత్మకంగా చాటిచెప్పడానికి ‘క్రియేట్‌ ఆన్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించాలి. మీరు రూపొందించే అంశాలతో మీకే కాకుండా దేశానికీ భారీగా లైక్‌లు రావాలి. ఐరాస భాషలైన జర్మన్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌ తదితరాల్లోనూ మీరు సమర్పణలు చేయగలగాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని