ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు అంతటా ఒకేలా ఉండాలి

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే రాజకీయ పార్టీల నాయకులపై చర్యలు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉండాలని భాజపా డిమాండ్‌ చేసింది.

Published : 27 Mar 2024 04:23 IST

ఈసీకి భాజపా నేతల విజ్ఞప్తి

దిల్లీ: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే రాజకీయ పార్టీల నాయకులపై చర్యలు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా ఉండాలని భాజపా డిమాండ్‌ చేసింది. అయితే, ఈసీ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రానికో విధంగా ఉంటున్నాయని ఆక్షేపించింది. తమిళులపై వ్యాఖ్యలకు గాను కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై చర్యలకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదని తెలిపింది. ప్రధాని మోదీని ఔరంగజేబుతో పోల్చిన శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వారిలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, వినోద్‌ తావడే, ఓం పాఠక్‌, సంజయ్‌ ముయూఖ్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని