Lockdownతో ఫలితాలు.. అందుకే మళ్లీ పొడిగిస్తున్నాం! 

కరోనా కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని, అందుకే దీన్ని పొడిగించాలని నిర్ణయించినట్టు......

Published : 24 May 2021 17:26 IST

బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ వెల్లడి

పట్నా: కరోనా కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని, అందుకే దీన్ని పొడిగించాలని నిర్ణయించినట్టు బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ వెల్లడించారు. లాక్‌డౌన్‌ వల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గుతున్నందున మరోవారం పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే విధించిన లాక్‌డన్‌ మే 25తో పూర్తవుతున్నందున రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్షించిన మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్‌ 1వరకు పొడిగిస్తున్నట్టు సీఎం ట్విటర్‌లో వెల్లడించారు. 

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో బిహార్‌లో భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదు కావడంతో మే 5 నుంచి 10 వరకు రాష్ట్రంలో తొలుత లాక్‌డౌన్‌ విదించారు. ఆ తర్వాత దాన్ని మే 25వరకు పొడిగించారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో నిత్యవసర దుకాణాలకు కేవలం నాలుగు గంటలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇంటికి అవసరమైన సరకులను  ఉదయం 6గంటల నుంచి 10గంటల మధ్య మాత్రమే కొనుగోలు చేసుకొనే వెసులుబాటు ప్రజలకు కల్పించారు. అత్యవసర సర్వీసులను అనుమతిస్తున్నారు.  సహేతుకమైన కారణాలు ఉంటేనే వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. వివాహాలు, అంత్యక్రియలకు 20 మంది మించరాదని ఆంక్షలు కొనసాగిస్తున్నారు. 

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6.89లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 4549 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 40,692 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని