Maruti Suzuki: ఎయిర్‌ బ్యాగ్‌ పని చేయలేదు.. కారు ధర రిఫండ్‌ చేయండి!

ప్రమాద సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ పనిచేయకపోవడంతో వినియోగదారుడికి ఆ కారు ధరను రిఫండ్‌ చేయలని వినియోగదారుల ఫోరం మారుతీ సుజుకీని ఆదేశించింది.

Published : 06 Feb 2024 19:39 IST

మలప్పురం: మూడేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కారులో ఎయిర్‌ బ్యాగ్‌ పనిచేయకపోవడంపై కేరళలోని వినియోగదారుల ప్యానెల్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ సదరు వినియోగదారుడికి ఆ కారు ధరను రిఫండ్‌ చేయాలని సూచించింది. ఇండియానూర్‌కు చెందిన మహమ్మద్‌ ముస్లియార్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మలప్పురం జిల్లా వినియోగదారుల కమిషన్‌ పైవిధంగా ఆదేశాలిచ్చింది.  వివరాల్లోకి వెళ్తే.. 2021 జూన్‌ 30న ఫిర్యాదుదారుడు తన కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలవడంతో పాటు వాహనం కూడా ధ్వంసమైంది.  

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ₹10వేలు జరిమానా

 వాహనంలో ఎయిర్‌బ్యాగ్ అమర్చడంలో తయారీదారు తప్పిదం వల్లే తనకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొంటూ అతడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ప్రమాద సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ పనిచేయలేదని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నివేదిక ఇవ్వడంతో  ఫిర్యాదుదారుడికి రూ.4,33,854తో పాటు పిటిషన్‌ ఖర్చుల కింద మరో రూ.20,000 చెల్లించాలని మారుతీ సుజుకీని వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. నెల రోజుల వ్యవధిలో తమ ఆదేశాలను అమలుచేయాలని.. లేదంటే 9 శాతం వడ్డీతో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని