NCB: రూ. 15 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌..!

ముంబయిలో డ్రగ్స్‌ మాఫియాపై ఎన్‌సీబీ విరుచుకుపడింది. ఏకంగా రూ. 15 కోట్లు విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకొంది.  

Updated : 13 Nov 2023 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాదకద్రవ్యాల నిరోధకశాఖ ముంబయి, దిల్లీలో దాడులు చేసి భారీ ఎత్తున కొకైన్‌ స్వాధీనం చేసుకొంది. ఈ సందర్భంగా ఇద్దరు విదేశీయులను అరెస్టు చేసింది. ఈ కొకైన్‌ విలువ రూ. 15 కోట్లు ఉంటుంది. దీనిపై ఎన్‌సీబీ అధికారి మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం మేరకు గురువారం ముంబయిలోని ఓ హోటల్‌పై దాడులు నిర్వహించి 2 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నామన్నారు. ఈ సందర్భంగా జాంబియా దేశానికి చెందిన ఎల్‌ఏ గిల్‌మోర్‌ను అరెస్టు చేశారు. అతడు డ్రగ్‌ రవాణదారుగా పనిచేస్తున్నాడని ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. 

దిల్లీవాసుల నిర్లక్ష్యం.. ‘వర్షం ఊరట’ను తుడిచిపెట్టిన టపాసుల మోత

గిల్‌మోర్‌ డ్రగ్స్‌ రవాణ కోసం జాంబియా నుంచి ఇథియోపియాకు వెళ్లాడు. అనంతరం విమానంలో ముంబయి చేరుకొని ఓ హోటల్‌లో బసచేశాడు. అతడి కదలికలపై ఎన్‌సీబీ బృందం ముందుగా నిఘా పెట్టింది. ఈ క్రమంలో అతడు ఉంటున్న హోటల్‌ రూమ్‌పై దాడి చేసింది. ఆ గదిలో ఉన్న బ్యాగ్‌ నుంచి 2 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకొంది. దీని విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. 

గిల్‌మోర్‌ని విచారించగా.. ఈ ప్రాంతంలోని డ్రగ్స్‌ రవాణాదారుల సమాచారం బయటపడింది. ఇతడిపై మరో హ్యాండిలర్‌ నియంత్రణ ఉందని గుర్తించారు. ఈ క్రమంలో దిల్లీలోని ఓ మహిళను గుర్తించారు. గిల్‌మోర్‌ను డ్రగ్స్‌తీసుకొని దిల్లీ రావాలని ఆమె చెప్పింది. వెంటనే అధికారులు దిల్లీకి చేరుకొని ఎమ్మార్‌ అగస్టీన అనే మహిళను అదుపులోకి తీసుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని