New born Baby: అమానవీయం.. బిడ్డను సజీవంగా భూమిలో పాతిపెట్టిన కన్నతల్లి..

అమ్మతనానికే అవమానం, మానవత్వానికి మచ్చతెచ్చే ఘటన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ బస్తీలో చోటు చేసుకుంది.

Updated : 17 Mar 2022 13:36 IST

లఖ్‌నవూ: అమ్మతనానికే అవమానం, మానవత్వానికి మచ్చతెచ్చే ఘటన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ బస్తీలో చోటు చేసుకొంది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను కన్నతల్లే సజీవంగా భూమిలో పాతిపెట్టింది. బస్తీలోని జిల్లా ఆసుపత్రి పక్కనే ఈ ఘటన చోటుచేసుకొంది. జిల్లా ఆసుపత్రికి సమీపంలో ఓ మహిళకు చిన్నారి ఏడుపు వినిపించింది. ఆ మహిళ వెళ్లి చూడగా.. ఆసుపత్రి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో.. భూమిలో సగం పాతిపెట్టిన శిశువు కనిపించింది. వెంటనే ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ బిడ్డను వెలికి తీశారు. శిశువును జిల్లా ఆసుపత్రిలోని పిల్లల వార్డుకు తరలించారు. చిన్నారికి చికిత్స చేసిన వైద్యులు.. పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. శిశువును సజీవంగా పాతిపెట్టిన ఆ చిన్నారి తల్లి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ బిడ్డను శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని