Passport: పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ దరఖాస్తు ఇక ఆన్‌లైన్‌లో..!

పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ దరఖాస్తును సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 26 Sep 2022 20:27 IST

పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లోనూ సదుపాయం

దిల్లీ: పాస్‌పోర్టు దరఖాస్తు దారులకు ఊరట కలిగించే విషయం. పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ దరఖాస్తును సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఆన్‌లైన్‌ పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లోనూ (POPSKs) ఈ సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. సెప్టెంబర్‌ 28 నుంచే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసుకోవాలంటే ముందస్తు పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ (PCC) అవసరం. ఇందుకోసం పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో స్లాట్‌ల ఆధారంగా వీటిని దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వీటిని జారీ చేస్తుంది. ఇటువంటి దరఖాస్తులు భారీ స్థాయిలో రావడం వల్ల పీసీసీ జారీకి సమయం పడుతుండడం, తద్వారా అభ్యర్థులకు పాస్‌పోర్ట్‌ జారీ ఆలస్యం అవుతోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆన్‌లైన్‌ పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లోనూ (POPSKs) ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు  విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

విదేశాల్లో ఉద్యోగంతోపాటు ఉన్నత విద్య, దీర్ఘకాలిక వీసా, విదేశాలకు వలస వెళ్లే వారికి పీసీసీ సర్టిఫికేట్‌ తప్పనిసరి. వీటికున్న డిమాండ్‌ నేపథ్యంలో పీఓపీఎస్‌కేలలోనే దరఖాస్తు సౌలభ్యం కలిగించడం వల్ల మరిన్ని స్లాట్‌లు (పీసీసీ అపాయింట్‌మెంట్‌) అందుబాటులోకి వస్తాయని విదేశాంగశాఖ అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని