PM Modi: మోదీ నోట ‘మినీ స్కర్ట్‌’ మాట.. ఎందుకంటే!

‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు’ల ప్రదానోత్సవం సందర్భంగా విజేతలతో ముచ్చటిస్తూ.. శతాబ్దాల క్రితం చెక్కిన శిల్పాల్లోనూ నేటి ఫ్యాషన్‌ శైలి స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Updated : 08 Mar 2024 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాషన్‌ రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతోకాలంగా ఈ రంగానికి భారత్‌ ఓ ఆవిష్కర్తగా నిలుస్తోందన్నారు. ఈసందర్భంగా ఆధునికతకు (Fashion) - ప్రాచీన భారతీయ కళాత్మకతకు మధ్య సంబంధాన్ని వివరించారు. ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు’ల ప్రదానోత్సవం సందర్భంగా విజేతలతో ముచ్చటిస్తూ.. శతాబ్దాల క్రితం చెక్కిన శిల్పాల్లోనూ నేటి ఫ్యాషన్‌ శైలి స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఎప్పటిలానే ఈసారి క్లీన్‌స్వీప్ ఖాయం: ప్రధాని మోదీ

‘ప్రపంచంలో రెడీమేడ్‌ జమానా నడుస్తోంది. మినీ స్కర్టులను (Mini Skirt) ఆధునికతకు చిహ్నంగా ఎంతోమంది భావిస్తారు. ఓసారి కోణార్క్‌(Sun Temple)కు వెళ్తే.. అక్కడ మినీ స్కర్టులతో కూడిన శతాబ్దాల నాటి విగ్రహాలను చూడొచ్చు. ఇప్పుడు ధరించినట్లుగానే అప్పుడు కూడా శిల్పాల భుజాలపైనా పర్సులు కనిపిస్తాయి. అటువంటి వస్త్రధారణ శైలిపై అప్పట్లో శిల్పాలు చెక్కేవారికీ అవగాహన ఉండేది’ అని ప్రధాని  మోదీ పేర్కొన్నారు. ఫ్యాషన్‌ విభాగంలో విజేతగా నిలిచిన జాన్వీ (19) సింగ్‌ అనే కంటెంట్‌ క్రియేటర్‌కు అవార్డు ప్రదానం చేసిన అనంతరం ఆమెతో ఈ విషయాలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని