ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. మోదీ విజ్ఞప్తి

ధనలను కట్టుదిట్టంగా పాటించాలని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మరోసారి కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోన్న తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశారు.

Updated : 07 Apr 2021 14:52 IST

దిల్లీ: దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మరోసారి కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోన్న తరుణంలో.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశారు.

‘నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యంగా జీవించడానికి అహర్నిశలూ సేవలందిస్తోన్న వారికి కృతజ్ఞతలు చెప్పుకునే సందర్భం. అలాగే ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలో తోడ్పాటు అందిస్తూ మన నిబద్ధతను చాటుకునే రోజు. మాస్క్ ధరిస్తూ, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడంతో పాటు ఇతర నిబంధనలను అనుసరిస్తూ కొవిడ్‌-19 పోరాటంపై దృష్టిపెడదాం’ అని ప్రధాని వరస ట్వీట్లు చేశారు. రోగనిరోధకతను పెంచుకునేలా, ఆరోగ్యంగా జీవించేలా జీవనశైలిని మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. దేశవాసులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్, పీఎం జనౌషధి వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

దేశంలో రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు లక్షకు పైగా కరోనా కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో..ప్రజలకు ప్రధాని ఈ సూచనలు చేశారు. తాజాగా 1,15,736 మందికి కరోనా సోకగా, 630 మరణాలు సంభవించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని