Rahul Gandhi: కులగణనకు మోదీ అంగీకరించరు: రాహుల్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ కుల గణనకు అంగీకరించరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. 

Updated : 08 Feb 2024 15:58 IST

భువనేశ్వర్‌: ప్రధాని నరేంద్ర మోదీ(Modi)ని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు.  కులం గురించి ఆయన అబద్ధం చెప్పారని ఆరోపించారు. ప్రస్తుతం రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో భాగంగా ఒడిశాలో పర్యటిస్తున్నారు.

‘మోదీ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన గుజరాత్‌లోని తెలి కులంలో జన్మించారు. దీనిని 2000 సంవత్సరంలో జనరల్ విభాగం నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చారు. ఆయన ఓబీసీకి చెందిన కుటుంబంలో జన్మించలేదు. అందుకనే.. తన జీవితాంతం కులగణనకు అంగీకరించరు’ అని రాహుల్(Rahul Gandhi) ఆరోపించారు. రాహుల్‌ తొలుత మోదీ కులాన్ని ‘తెలి’గా పేర్కొన్నారు. ఆ తర్వాత ‘ఘాంచీ’ కులాన్ని ఉద్దేశించే తాను అలా అన్నానని తెలిపారు. ‘ఘాంచీ’నే కొన్ని ప్రాంతాల్లో ‘తెలి-ఘాంచీ’, ‘మోద్‌-ఘాంచీ’గా పేర్కొంటారు.

మన్మోహన్‌జీ చక్రాల కుర్చీలోనూ పనిచేశారు.. మాజీ ప్రధానిపై మోదీ ప్రశంసలు

ఇదిలా ఉంటే.. గురువారం ఒడిశా నుంచి ఈ యాత్ర ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించనుంది. కొద్దినెలల క్రితం అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) తొలిసారి అక్కడకు వెళ్లనున్నారు. మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’.. 15 రాష్ట్రాలు 100 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 67 రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 14న మణిపుర్‌లోని ధౌబల్‌ పట్టణంలో మొదలైన ఈ కార్యక్రమం.. దాదాపు 6713 కి.మీ మేర సాగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని