‘ఏం ధరించాలన్నది పూర్తిగా మీ నిర్ణయం’: రాహుల్ గాంధీ

ఒకరు ఏ ధరించాలో మరొకరు నిర్ణయించకూడదని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. 

Published : 27 Feb 2024 12:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహిళల దుస్తుల ఎంపికను గౌరవించాలని, ఒక వ్యక్తి ఏం ధరించాలో నిర్దేశించకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో గత భాజపా ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. దీనిని ఉద్దేశించి ఓ విద్యార్థిని రాహుల్‌ను ప్రశ్నించింది. ‘మీరు ప్రధాని అయితే..’ అంటూ ఆ వివాదంపై అభిప్రాయాన్ని కోరింది. ‘ఒక మహిళ ఏమి ధరించాలన్నది ఆమె వ్యక్తిగత విషయం. అందుకు అనుమతించాలన్నది నా అభిప్రాయం. మీరేం ధరించాలన్నది పూర్తిగా మీ నిర్ణయం. దానిని మరొకరు నిర్దేశించాలని నేను అనుకోను’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు.

తెలంగాణ నుంచి రాహుల్‌ పోటీ!

ఇదిలా ఉంటే.. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కొద్దినెలలక్రితం ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.‘‘రాష్ట్రంలోని మహిళలు ఏ దుస్తులు ధరించాలి.. ఏం తినాలి అనేది వారి ఇష్టం. నేనేందుకు వాళ్లను అడ్డుకోవాలి? ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించడంలో తప్పేముంది? ’’అని ఆ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని