Supreme Court: మా వరకు రాకముందే.. బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి : సుప్రీం కోర్టు

అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు సంబంధించిన వ్యవహారాలు కోర్టుకు రాకముందే గవర్నర్లు నిర్ణయాలు తీసుకోవాలని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) అభిప్రాయపడింది.

Published : 06 Nov 2023 14:53 IST

దిల్లీ: అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు (Governor) ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌ గవర్నర్‌ తీరుపై అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సమయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లులకు సంబంధించిన అంశం కోర్టుకు రాకముందే గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ క్రమంలో గవర్నర్లకు ఆత్మపరిశీలన కూడా అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

గవర్నర్‌ (Punjab Governor) వద్ద ఉన్న బిల్లుల పెండింగు అంశంపై పంజాబ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ‘ఈ అంశం సుప్రీం కోర్టుకు రాకముందే గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం సుప్రీం కోర్టుకు చేరినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడానికి ముగింపు పలకాలి. గవర్నర్లకు ఆత్మపరిశీలన కూడా అవసరం. వారు ప్రజా ప్రతినిధులు కాదనే విషయాన్ని తెలుసుకోవాలి’ అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

తనిఖీలా..? తొలగింపా..?: ప్రతిమ హత్య కేసులో అనుమానాలు..

పంజాబ్‌ గవర్నర్‌ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. బిల్లులపై గవర్నర్‌ చర్యలు తీసుకున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో పంజాబ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ అనవసరమైందని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సంబంధించి పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ తీసుకున్న చర్యలపై తాజా నివేదికను అందించాలని సొలిసిటర్‌ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 10కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని