Vaccine: ప్రారంభమైన స్పుత్నిక్‌ వి ఉత్పత్తి

దేశంలో కరోనా విజృంభించి తీవ్ర టీకా కొరత ఏర్పడ్డ తరుణంలో తీపి కబురు. భారత్‌లో సోమవారం నుంచి‘స్పుత్నిక్‌ వి’ వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు రష్యన్‌ డెరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) వెల్లడించింది....

Published : 24 May 2021 23:54 IST

ఏడాదికి పదికోట్ల డోసుల ఉత్పత్తి

దిల్లీ: దేశంలో కరోనా విజృంభించి తీవ్ర టీకా కొరత ఏర్పడ్డ తరుణంలో తీపి కబురు. భారత్‌లో సోమవారం నుంచి ‘స్పుత్నిక్‌ వి’ వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు రష్యన్‌ డెరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) వెల్లడించింది. దిల్లీకి చెందిన ప్రముఖ టీకా, ఔషధ సంస్థ పనాసియా బయోటెక్‌తో కలిసి ప్రతి సంవత్సరం పదికోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు ఆర్‌డీఐఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటి దశలో ఉత్పత్తి చేసిన డోసు నమూనాలను మాస్కోకు తరలించి అక్కడ నాణ్యతా తనిఖీలు నిర్వహించాక, ఆ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదానికి పంపనున్నట్లు తెలిపింది.

‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో స్పుత్నిక్‌ టీకా ఉత్పత్తి ఎంతోమందికి సాయపడుతుంది. ఇక్కడ సరిపడా ఉత్పత్తి చేసి, అనంతరం ఇతర దేశాలకు ఉపయోగపడేలా ఎగుమతి చేస్తాం’ అని ఆర్‌డీఐఎఫ్‌ సీఈఓ క్రిల్ల్‌ ద్మిత్రీవ్ వెల్లడించారు. ‘ఆర్‌డీఐఎఫ్‌తో కలిసి స్పుత్నిక్ వి ఉత్పత్తిని ప్రారంభించడం ఆనందంగా ఉంది. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తోడ్పాటు అందించాలనుకుంటున్నాం’ అని పనాసియా బయోటెక్‌ ఎండీ డా.రాజేశ్‌ తెలిపారు.

ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ స్పుత్నిక్‌ వి టీకాను అభివృద్ధి చేసింది. భారత్‌లో వినియోగానికి ఈ టీకాకు గతంలోనే అనుమతి లభించగా ఇటీవలే ఈ టీకా అందుబాటులోకి వచ్చింది. జీఎస్టీతో కలిపి ఒక్కో డోసు ధర రూ.995.40గా నిర్ణయించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని