Bengaluru CEO: లేఖరాసి కుమారుడి మృతదేహం పక్కన పెట్టిన సీఈవో..!

కన్న కుమారుడిని హత్య చేసిన ‘మైండ్‌ఫుల్‌’ ఏఐ సంస్థ సీఈవో సుచనాసేఠ్‌ మానసిక ఆరోగ్యంపై దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Updated : 12 Jan 2024 10:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో అరెస్టైన ‘మైండ్‌ఫుల్‌’ ఏఐ సంస్థ సీఈవో సుచనాసేఠ్‌ (Suchana Seth) మానసిక పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె లేఖ రాసి.. కుమారుడి మృతదేహం పక్కన పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. న్యాయస్థానంలో విడాకులు, బాలుడి కస్టడీపై విచారణతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.

సుచనా తన కుమారుడి కస్టడీ అంశాన్ని.. టిష్యూ పేపర్‌పై ఐలైనర్‌ వాడి లేఖ రాసింది. ‘‘ఏం జరిగినా సరే కుమారుడు నా వద్దే ఉండాలి. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు నాకే దక్కాలి’’ అని అందులో పేర్కొంది. హత్య అనంతరం బాలుడి మృతదేహాన్ని ఉంచిన బ్యాగ్‌లో ఆ లేఖ పెట్టింది.

మగ బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి బాలిక.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

మరోవైపు.. కేసు విచారణకు సుచనా ఏమాత్రం సహకరించడంలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. హత్య విషయంలో ఆమెకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకు మానసిక, శారీరక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్యాగ్‌లో దొరికిన లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. భర్తతో ఉన్న విభేదాల తీవ్రత, కోర్టు ఆదేశాలపై ఆమెలో ఉన్న అసంతృప్తిని ఈ లేఖ తెలియజేస్తోందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

కుమారుడితో గడిపేందుకు భర్తను కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు చెబుతున్నారు. 2022లో వీరి విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. భర్త ప్రతి ఆదివారం తన తనయుడితో ఉండేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఇది సుచనాను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని