CBI: దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. పిల్లల్ని వేధించే ముఠాలే లక్ష్యంగా..!

ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే ముఠాలే లక్ష్యంగా సీబీఐ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు.....

Published : 16 Nov 2021 21:40 IST

దిల్లీ: ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే ముఠాలే లక్ష్యంగా సీబీఐ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు. చిన్నారుల్ని లైంగికంగా వేధించిన ఆరోపణలపై సీబీఐ ఈనెల 14న 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.   ఆంధ్రప్రదేశ్​ సహా.. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్‌, బిహార్‌, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. సుమారు 80 బృందాలు అనుమానిత ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు వెల్లడించింది.

2019లో, సీబీఐ తన ప్రత్యేక క్రైమ్ జోన్ కింద న్యూదిల్లీలో ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్‌ప్లోయిటేషన్ (OCSAE) నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రత్యేక బృందం సేకరిస్తుంది. అనంతరం నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇప్పటివరకు వివిధ కేసుల్లో పలువురు నిందితులను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని