Supreme Court: ఇనుప ఖనిజం అక్రమరవాణాపై కేంద్రం స్పందించాలి: సుప్రీం 

దేశం నుంచి ఇనుప ఖనిజం అక్రమ రవాణా వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది ఎం.ఎల్‌. శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై..

Published : 26 Aug 2021 13:13 IST

దిల్లీ: దేశం నుంచి ఇనుప ఖనిజం అక్రమ రవాణా వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది ఎం.ఎల్‌. శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. అక్రమ రవాణా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. ఖనిజం అక్రమ రవాణాపై కేంద్రం స్పందించాలని సీజేఐ నిర్దేశించారు. దీనిపై రెండు వారాల్లో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని