Modi: వీర సైనికుల మృతిపై ఉద్వేగంగా మాట్లాడిన ప్రధాని..!

దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన తమిళనాడు హెలికాఫ్టర్ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా ఎవరు ఆ వేదనను నుంచి బయటపడలేదు.

Updated : 11 Dec 2021 18:28 IST

బలరామ్‌పూర్: దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన తమిళనాడు హెలికాఫ్టర్ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా ఎవరు ఆ వేదనను నుంచి బయటపడలేదు. యూపీలో బలరామ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ దుర్ఘటనపై మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. అసువులుబాసిన సైనికులకు మరోసారి సంతాపం తెలియజేశారు. దేశ తొలి సీడీఎస్ బిపిన్‌ రావత్ మరణం దేశానికి తీరని లోటన్నారు.  ఈ సందర్భంగా ఆయన ధైర్యసాహసాలను కొనియాడారు. ఆయన చేసిన సేవలకు ఈ దేశమే సాక్షిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

‘మిలిటరీలో ఉన్నతం కాలం మాత్రమే ఒక సైనికుడు.. సైనికుడిగా ఉంటాడునుకుంటే పొరపాటు. తన జీవితకాలమంతా అతడు యోధుడిగానే ఉంటాడు. ప్రతి క్షణం క్రమశిక్షణతో జీవిస్తూ.. దేశాన్ని సగర్వంగా నిలిపేందుకు కృషిచేస్తాడు. రావత్‌ ఎక్కడున్నా.. సరికొత్త తీర్మానాలతో భారత్ ముందుకెళ్లే ప్రక్రియను చూస్తారు. భారత్‌ ఇంత దుఃఖంలో ఉన్నప్పటికీ.. మన వేగం, అభివృద్ధి ఆగదు. భారత్‌ ఆగదు, నిలిచిపోదు. భారతీయులంతా కలిసి పనిచేసి, ఇంటా బయటా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటారు’ అంటూ మోదీ ఉద్వేగంగా మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని