Tamil Nadu: తమిళనాట ‘పెరుగు’ వివాదం.. పేరు మార్పుపై రగడ
పెరుగు (Curd) పేరుపై తమిళనాట వివాదం జరుగుతోంది. పెరుగు ప్యాకెట్లపై హిందీలోనే పేరు రాయాలని FSSAI ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారానికి దారితీశాయి.
చెన్నై: హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. తమిళనాడు (Tamil Nadu)లో మరో వివాదం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ‘పెరుగు (Curd)’ పేరును మార్చడమే ఇందుక్కారణం. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగింది. ఏంటీ ‘పెరుగు’ వివాదం..?
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఇటీవల తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (Milk Producers Federation)కు ‘పెరుగు’ పేరుపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న Curd, తమిళంలో ఉన్న ‘తయిర్ (Tayir)’ పేర్లను తొలగించి.. ‘దహీ (Dahi)’ అని హిందీలోకి మార్చాలని ఆ ఉత్తర్వుల సారాంశం. కేవలం పెరుగు మాత్రమే గాక.. నెయ్యి, చీజ్ వంటి డైరీ ఉత్పత్తుల పేర్లను కూడా ఇలాగే మార్చాలని FSSAI ఆదేశించింది. తమిళనాడు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు కూడా ఇలాంటి ఉత్తర్వులే పంపినట్లు తెలిసింది.
అయితే ఈ ఆదేశాలపై తమిళనాట (Tamil Nadu) తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. FSSAI నిర్ణయాన్ని పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కూడా ఈ ఆదేశాలపై మండిపడ్డారు. ‘‘హిందీ (Hindi)ని బలవంతంగా రుద్దాలనే వారి పట్టుదల మరింత పెరుగుతోంది. చివరకు పెరుగు ప్యాకెట్‌పైనా మా సొంత భాషలో ఉన్న పేరును మార్చేసి హిందీలో రాయమని చెబుతున్నారు. మాతృభాషల పట్ల ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదు. దీనికి బాధ్యులైన వారిని(కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుంది’’ అని స్టాలిన్ ధ్వజమెత్తారు.
అంతేగాక, తమిళనాడులో భాజపా చీఫ్ అన్నామలై కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘‘ప్రాంతీయ భాషాలను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ విధానాలకు ఇది విరుద్ధంగా ఉంది. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి’’ అని అన్నామలై డిమాండ్ చేశారు. కాగా.. తాము ‘దహీ (Dahi)’ అనే పేరును వినియోగించబోమని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సమాఖ్య స్పష్టం చేసింది.
వెనక్కి తగ్గిన FSSAI:
ఈ పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర వివాదానికి దారితీసిన నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెనక్కి తగ్గింది. పెరుగు పేరు మార్పుపై తన ఆదేశాలను సవరించింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్ల పేరుతో పాటు స్థానిక భాషల పేర్లను బ్రాకెట్లలో పెట్టుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల
-
UPPAL Stadium: ఆటతో అదిరేలా.. ఉప్పల్ ఊగేలా!