7:11 PM Trailer Telugu: రెండు గ్రహాలు... మూడు కాలాలు

అతడు మనదేశంలోని హంసలదీవి అనే ఊళ్లో ఓ బస్‌ ఎక్కాడు. మరుసటి రోజు మెల్‌బోర్న్‌ బీచ్‌లో తేలాడు. బస్‌ ఎక్కిన ఆ వ్యక్తి ఒక్క రోజులోనే అంత దూరం ఎలా ప్రయాణించాడు?

Updated : 30 Jun 2023 15:44 IST

తడు మనదేశంలోని హంసలదీవి అనే ఊళ్లో ఓ బస్‌ ఎక్కాడు. మరుసటి రోజు మెల్‌బోర్న్‌ బీచ్‌లో తేలాడు. బస్‌ ఎక్కిన ఆ వ్యక్తి ఒక్క రోజులోనే అంత దూరం ఎలా ప్రయాణించాడు? తిరిగి తను అనుకున్న చోటకి వెళ్లేందుకు కాలంతో ఎలా పోటీ పడాల్సి వచ్చిందో తెలియాలంటే ‘7:11 పి.ఎమ్‌’ చూడాల్సిందే. ఫ్యూరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సాహస్‌, దీపిక జంటగా నటించారు. చైతు మాదాల దర్శకత్వం వహించారు. నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మాతలు. ఈ చిత్రం జులై 7న మైత్రి డిస్ట్రిబ్యూషన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్‌.ఎస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. విజువల్స్‌, సంగీతం చాలా బాగున్నాయి. ట్రైలర్‌ చూస్తుంటే భారీ సినిమాల స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆకర్షిస్తున్నాయి’’ అన్నారు. అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాని తీశారని చైతు  మాదాలని అభినందించారు నిర్మాత వై.రవిశంకర్‌. చిత్ర దర్శకుడు చైతు మాదాల మాట్లాడుతూ ‘‘రెండు గ్రహాలు, మూడు కాలాలు, ఒక టౌన్‌ చుట్టూ సాగే కథ ఇది. వీటిని ఓ కథతో ఎలా కనెక్ట్‌ చేశామనేది ఆసక్తికరం. అన్ని రకాల అంశాలున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ గ్రహాన్ని రూపొందించాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ పట్నాయక్‌తోపాటు చిత్రబృందం పాల్గొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని